RGV Sensational Tweet : వీధి కుక్కల అంశంపై రాంగోపాల్‌ వర్మ సంచలన ట్వీట్

రాంగోపాల్‌ వర్మ వీధి కుక్కల అంశంపై సంచలన ట్వీట్‌ చేసి డాగ్ లవర్స్‌ను ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

RGV Sensational Tweet : వీధి కుక్కల అంశంపై రాంగోపాల్‌ వర్మ సంచలన ట్వీట్

RGV Sensational Tweet | విధాత: వీధి కుక్కుల అంశంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఓ చిన్నారికి సంబంధించిన వీడియోని ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పుపై ఏడుస్తున్న డాగ్‌ లవర్స్‌ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక నగరం మధ్యలో పట్టపగలు నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. మరో ట్వీట్ లో వీధి కుక్కుల నిర్మూలనను వ్యతిరేకిస్తన్న వారికి 10ప్రశ్నలు సంధించారు. వీధి కుక్కలు ప్రజలను, చిన్నారులను కరిచి చంపుతుంటే కుక్కల ప్రేమికులు కుక్కుల హక్కుల కసం ట్వీట్లు చేయడంలో బిజీగా ఉన్నారని సైటర్ వేశారు. మీరు కుక్కలు చనిపోతే కన్నీళ్లు కారుస్తున్నారు..గేటెడ్‌ కమ్యూనిటీల్లో వీధి కుక్కల దాడులు జరగవు..పేదల బస్తీల్లోనే దాడులు చేస్తాయని గుర్తు చేశారు.

కుక్కల ప్రేమికులు వాటిని నిర్మూలించరాదనే వారు ఒక్క వీధి కుక్కను దత్తత తీసుకోవడానికి మాత్రం ముందుకు రారంటూ అసహనం వ్యక్తం చేశారు.ఎందుకంటే అవి తక్కువ జాతి, మురికి, రోగాలతో ఉంటాయని..మీమ్మల్ని ప్రమాదంలో పడేస్తాయన్న భయమా అని ప్రశ్నించారు. మీ విలాసవంతమైన ఇళ్లల్లో కుక్కలను మాత్రమే ప్రేమించండంటూ చురకలేశారు. కుక్కలు చనిపోతే కన్నీళ్లు కారుస్తున్నారు.. మనుషులు చనిపోతే మాత్రం కన్నీళ్లు పెట్టుకోరు ఎందుకంటూ వీధి కుక్కుల నిర్మూలనను వ్యతిరేకిస్తున్న వారిని రాంగోపాల్‌ వర్మ ప్రశ్నించారు.

మనిషిని చంపిన వాడు హంతకుడంటారని..కుక్క మనిషిని చంపితే ప్రమాదం అంటున్నారని..జంతువుల మాదిరిగా చంపితే ప్రమాదం అంటారా అని ప్రశ్నించారు. ఒక తల్లి తన బిడ్డను కుక్క కరిచి చంపడాన్ని చూస్తుంది..మీరు ఆమె కోసం కూడా ఓ హ్యాష్ ట్యాగ్ ఎందుకు సృష్టించారంటూ నిలదీశారు. అన్ని జంతువులకు జీవించే హక్కు ఉండవచ్చని..అది మానవ ప్రాణాలను ఫణంగా పెట్టవచ్చని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కుక్కడ బెడద తీవ్రత సమస్యను సుమోటోగా కేసుగా తీసుకున్న సుప్రీం కోర్టు.. ఢిల్లీ నగరంలోని వీధి కుక్కలన్నింటిని 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని ఆగస్టు 11న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు దీన్ని అడ్డుకోవాలని జంతు ప్రేమికులు ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

అయితే సుప్రీంకోర్టు తీర్పుని పలువురు జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇందులో సదా, జాన్వీ కపూర్‌, సోనాక్షి సిన్హా లాంటి సినీ తారలు కూడా ఉన్నారు. వారందరికి రాంగోపాల్ వర్మ తన ట్వీట్ తో కౌంటర్ వేశారు.