Warangal: మైనర్ బాలికను అపహరించి లైంగికదాడి.. ఆపై వ్యభిచారం చేయించే యత్నం.. ముఠా అరెస్టు
వరంగల్ నగరంలోని ఓ మైనర్ బాలికను అపహరించి లైంగికదాడికి పాల్పడిన అనంతరం వ్యభిచారం చేయించేందుకు యత్నిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక బాలిక, ఒక మహిళ, నలుగురు వ్యక్తులు ఉన్నారు.

విధాత ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరంలోని ఓ మైనర్ బాలికను అపహరించి లైంగికదాడికి పాల్పడిన అనంతరం వ్యభిచారం చేయించేందుకు యత్నిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక బాలిక, ఒక మహిళ, నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరి నుండి పోలీసులు ఒక కిలో ఎనిమిది వందల గ్రాముల గంజాయితో పాటు ఒక కారు, 75వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ప్రధాన నిందితురాలి ఇంటి వద్ద భారీ స్థాయిలో కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడిస్తూ ఈ 11వ తేదీన బాలిక కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదుపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు బాలికను ములుగు క్రాస్ రోడ్డు వద్ద గుర్తించి, పోలీసులు సంరక్షణలో తీసుకొని విచారించగా.. తనను కొంత మంది వ్యక్తులు అపహరించారని, తదుపరి గంజాయి తాగించి లైంగికదాడి చేశారని సదరు బాలిక వెల్లడించింది. దీనితో అప్రమత్తమైన పోలీసులు.. వరంగల్ ఏసీపీ అధ్వర్యంలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసిన నిందితులను పట్టుకొని విచారించారు.

ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలైన ముస్కు లత, ల్యాదేళ్ళ గ్రామంలో వ్యభిచార వృత్తిని కొనసాగిస్తున్నది. తల్లిదండ్రులు మరణించిన మరో మైనర్ నిందితురాలికి తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించింది. తన వృత్తిలో అవసరమైన కొత్త మహిళలు లేదా బాలికలను తీసుకొచ్చి ఈ వ్యభిచారం నిర్వహించడం ద్వారా పెద్ద మొత్తం డబ్బు వస్తాయని, దానిలో కొంత డబ్బు ఇస్తానని మైనర్ నిందితురాలికి ఆశపెట్టింది. దీనికి సదరు బాలిక సిద్దపడింది. తన స్నేహితరాలితో పరిచయమై బాధిత బాలికను లక్ష్యంగా ట్రాప్ చేసింది. అబ్దుల్ అఫ్నాన్ అనే వ్యక్తితో కలిసి బాలికను తీసుకవెళ్ళి మద్యం, గంజాయి తాగటం అలవాటు చేశారు. నిందితురాలిపై నమ్మకం కలిగేందుకు బాలికకు కొత్త దుస్తులు ఇప్పించారు. వీరిపై నమ్మకం కలిగిన సదరు బాలికను ఈ నెల 11వ తేదీన తీసుకువెళ్ళి గంజాయి తాగించారు. ఆ సమయంలో షేక్ సైలాని బాబా ఆ బాలికపై లైంగికదాడి చేశాడు. అనంతరం బెదిరించి బాలికను ములుగు క్రాస్ రోడ్డు వదిలి వెళ్ళారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, మిల్స్ కాలనీ ఇన్స్‌పెక్టర్ వెంకటరత్నం, ఎస్‌ఐలు శ్రీకాంత్, సురేశ్, ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు:
1. ముస్కు లత, ల్యాదేళ్ళ గ్రామం, దామెర మండలం, వరంగల్ జిల్లా, 2. మైనర్ బాలిక, 3. వరంగల్ శంభుని పేటకు చెందిన అబ్దుల్ అఫ్నాన్, షేక్‌సైలాని బాబా, మహ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ ఆలియాస్ వదూద్.