19 జులై నుండి అన్‌రిజర్వ్‌డ్ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఈ రైళ్లు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా నడుస్తాయి ప్రయాణికులకు ఉపయోగపడనున్న రైళ్ల వేగవంతం విధాత:కోవిడ్19 మహమ్మారితో ఎదురైన ఇబ్బందులతో దశలవారిగా రైళ్ల సర్వీసులను ప్రారంభిస్తున దక్షిణ మధ్య రైల్వే ముఖ్యంగా స్థానిక ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా జోన్ పరిధిలో అన్‌రిజర్వ్‌డ్ రైళ్ల సర్వీసులను పున రుద్ధరించనుంది. ప్రధానంగా ఈ రైళ్లు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా నడుపబడుతాయి. అనగా ఇవి అన్‌రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లగా నిర్వహించబడుతాయి. దీంతో ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దక్షిణ […]

- ఈ రైళ్లు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా నడుస్తాయి
- ప్రయాణికులకు ఉపయోగపడనున్న రైళ్ల వేగవంతం
విధాత:కోవిడ్19 మహమ్మారితో ఎదురైన ఇబ్బందులతో దశలవారిగా రైళ్ల సర్వీసులను ప్రారంభిస్తున దక్షిణ మధ్య రైల్వే ముఖ్యంగా స్థానిక ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా జోన్ పరిధిలో అన్‌రిజర్వ్‌డ్ రైళ్ల సర్వీసులను పున రుద్ధరించనుంది. ప్రధానంగా ఈ రైళ్లు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా నడుపబడుతాయి. అనగా ఇవి అన్‌రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లగా నిర్వహించబడుతాయి. దీంతో ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే గత సంవత్సరం ముఖ్యమైన మార్గాల్లో ట్రాకు పటిష్టత కోసం అనేక పనులు చేపట్టింది. దీంతో జోన్ నెట్‌వర్క్‌లో వివిధ సెక్షన్లలో రైళ్లు వీలైనంత పరిమిత వేగం పెంపుతో ప్రయాణించే అవకాశం ఏర్పడిరది. ఈ ట్రాక్ మెరుగుదల పనులతో ప్రయాణ సమయం తగ్గడం వలన, ఈ రైళ్లు అన్‌రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులుగా నడపడానికి వీలుకలిగింది. ఈ అన్‌రిజర్వ్‌డ్ రైలు సర్వీసు లను దశలవారిగా వచ్చే వారంలో 19 జులై 2021 తేదీ నుండి ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా 82 రైళ్ల సర్వీసు లను పునరుద్ధరిస్తున్నారు. ఈ 82 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో నడపడం వలన ప్రయాణికులందరి అవసరాలు తీరుతాయి. ప్రయాణికులు వారి టికెట్లను వివిధ మార్గాల్లో కొనుగోలు చేయవచ్చు. స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లతో పాటు యూటీఎస్ యాప్ (ఆన్‌లైన్), ఏటీవీఎమ్ (అటోమెటిక్ టికెట్ వెండిరగ్ మెషిన్లు), సీవోటీవీఎమ్‌లు (కాయిన్ టికెట్ వెండిరగ్ మెషిన్స్) మొదలగు వాటిలో కూడా టికెట్లు తీసుకోవచ్చు. కోవిడ్
19 మహమ్మారి దృష్ట్యా భౌతిక దూరం పాటించేలా ప్రయాణికు లను యూటీఎస్ యాప్ మరియు ఏటీవీఎమ్‌లు విని యోగించేలా ప్రోత్సాహించబడుతుంది. దీంతో బుకింగ్ స్టేషన్ల వద్ద క్యూలను, రద్దీని నివారించవచ్చు. ఇంతేకాక ప్రయాణికు లకు సీజనల్ టికెట్లు తీసుకునే సదుపాయం కూడా ఉంది.
రైల్వే స్టేషన్లలో మరియు రైళ్లలో కూడా కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రయాణికులకు సూచించారు. ప్రయాణి కుల రవాణా అవసరాలను తీర్చడానికి డిమాండ్‌ను బట్టి ఈ రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రయాణికులు వారి భద్రత కోసం కచ్చితంగా మాస్కు ధరించ డం, భౌతిక దూరం పాటించడం, క్రమంగా శానిటైషన్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.