తుగ్ల‌గీ జ‌గ‌న్

ఆర్ఎస్ఎస్ (ఆర్గ‌నైజ‌ర్) పత్రిక సీఎం జ‌గ‌న్ పై సంచలన కధనం .. విధాత‌:బెంగళూరు, పులివెందుల, హైదరాబాద్‌లలో జగన్‌ విలాసవంతమైన భవంతులు నిర్మించారని, అమరావతిలోనూ అత్యంత ఖరీదైన భవంతిని నిర్మించారని వెల్లడించింది. 2011లో హైదరాబాద్‌లోని జగన్‌ నివాసంలో సీబీఐ దాడులు చేసినప్పుడు.. ఎకరా విస్తీర్ణంలో 75 గదులున్న ఆ భవనంలో విచారణ చేసేందుకు సీబీఐకి పది గంటల సమయం పట్టిందని తెలిపింది. ఈ భవనం విలువ దాదాపు రూ.400 కోట్లు ఉంటుందని అనధికారిక అంచనా అని వెల్లడించింది. ఈ […]

తుగ్ల‌గీ జ‌గ‌న్

ఆర్ఎస్ఎస్ (ఆర్గ‌నైజ‌ర్) పత్రిక సీఎం జ‌గ‌న్ పై సంచలన కధనం ..

విధాత‌:బెంగళూరు, పులివెందుల, హైదరాబాద్‌లలో జగన్‌ విలాసవంతమైన భవంతులు నిర్మించారని, అమరావతిలోనూ అత్యంత ఖరీదైన భవంతిని నిర్మించారని వెల్లడించింది. 2011లో హైదరాబాద్‌లోని జగన్‌ నివాసంలో సీబీఐ దాడులు చేసినప్పుడు.. ఎకరా విస్తీర్ణంలో 75 గదులున్న ఆ భవనంలో విచారణ చేసేందుకు సీబీఐకి పది గంటల సమయం పట్టిందని తెలిపింది. ఈ భవనం విలువ దాదాపు రూ.400 కోట్లు ఉంటుందని అనధికారిక అంచనా అని వెల్లడించింది. ఈ భవనంపై హెలిప్యాడ్‌ నిర్మించే యోచనలో జగన్‌ ఉన్నారంటూ ప్రచారం జరిగిందని, బెంగళూరులోని ఆయనకు చెందిన 31 ఎకరాల భవన సముదాయంలో హెలిప్యాడ్‌ ఉందని వెల్లడించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. దేశ జనాభాలో అత్యధికులు సాదాసీదా జీవితం గడుపుతుంటే.. జగన్‌ అత్యంత విలాసవంతంగా ఉన్నారని పేర్కొంది. ఏం చేయకున్నా వందల కోట్ల ఆస్తులు ఉన్న జగన్‌ ఒక్క ఉద్యోగం కూడా చేయలేదని, వ్యాపారమూ నిర్వహించలేదని, అయినా ఆయన సంపద వేల కోట్లు ఉంటుందని ఘాటుగా విమర్శించింది. ఓ సిట్టింగ్‌ ఎంపీనే టార్గెట్‌ చేసినపుడు.. రేపు జగన్‌ అజెండాను విమర్శిస్తే ప్రధాని, హోం మంత్రి, సుప్రీం కోర్టు/హైకోర్టు న్యాయమూర్తులను కూడా టార్గెట్‌ చేయరా అనే సందేహాలు కలుగుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో చట్టాలు సరిగా పనిచేయడం లేదని, జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే 24 గంటల్లో అరెస్ట్‌ చేస్తారని చాలామంది చెబుతున్నారని వ్యాఖ్యానించింది. ఆర్ఎస్ఎస్ పత్రిక ది ఆర్గనైజర్‌లో జగన్‌పై “తుగ్ల‌గీ జ‌గ‌న్” అనే ప్రత్యేక విమర్శనాత్మక కథనం రావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.