Ram Charan Sai Pallavi: రామ్‌చ‌ర‌ణ్‌తో.. సాయి ప‌ల్ల‌వి?

  • By: sr    news    Dec 16, 2024 10:34 AM IST
Ram Charan Sai Pallavi: రామ్‌చ‌ర‌ణ్‌తో.. సాయి ప‌ల్ల‌వి?

విధాత‌: భానుమతి సింగిల్ పీస్ అంటూ ఫిదా మూవీలో సాయి పల్లవి నటనను అంత తేలిగ్గా ఎవ్వరూ మర్చిపోలేరు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్‌తో సాయిపల్లవి (Sai Pallavi) దూసుకుపోతోంది.

రీసెంట్‌గా ఈ టాలెంటెడ్ భామ ‘అమరన్’ మూవీతో డీసెంట్ హిట్ అందుకుంది. త్వరలో అక్కినేని నాగచైతన్యతో కలిసి తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే సాయి పల్లవి తన అభిమానులకు ఓ సూపర్ డూపర్ గుడ్ న్యూస్ అందించబోతోంది. ఇప్పటిదాకా చిన్న హీరోలతోనే సినిమాలు చేసిన సాయిపల్లవి, ఓ టాప్ మోస్ట్ స్టార్ హీరోతో కలిసి చేయబోతోంది. ఆ హీరో ఎవరో కాదు గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).

వచ్చే ఏడాది సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ సినిమా చేయబోతున్నాడు. రంగస్థలం సూపర్ హిట్ తర్వాత ఈ కాంబోలో రెండో సినిమా వస్తోందని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తోది.