ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు రెండో రోజు వైద్య పరీక్షలు

విధాత,హైదరాబాద్: ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రబాద్‌లోని తిరుమల గిరి ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు బుధవారం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు. ఆర్మీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో రాఘురామ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా మరి కొద్ది సేపటిలో నిన్న చేసిన వైద్య పరీక్షల రిపోర్టులు ఆర్మీ వైద్యులకు అందనున్నాయి. రెండో రోజు కూడా ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకి పంపిస్తున్నారు. […]

ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు రెండో రోజు వైద్య పరీక్షలు

విధాత,హైదరాబాద్: ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రబాద్‌లోని తిరుమల గిరి ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు బుధవారం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు. ఆర్మీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో రాఘురామ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా మరి కొద్ది సేపటిలో నిన్న చేసిన వైద్య పరీక్షల రిపోర్టులు ఆర్మీ వైద్యులకు అందనున్నాయి. రెండో రోజు కూడా ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకి పంపిస్తున్నారు.

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆర్మీ ఆస్పత్రిలో హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్మీ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్య అధికారుల బృందంతో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అధికారులు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. వైద్య బృందం రఘురామకు ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నడవలేక పోవడానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఆయన చెప్పిన సమస్యలపై వైద్యలు పరీక్షలు నిర్వహించనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు రిజిస్టర్ నాగార్జునను న్యాయధికారిగా నియమించింది. చికిత్స ప్రక్రియ మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు చెప్పే స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. జ్యూడిషియల్ కష్టడీలో ఉన్న ఎంపీని ఎవరు కలవడానికి వీలులేదు. ఈ నెల 21వ తేదీ వరకు రాఘురామను మిలటరీ ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు చేయనున్నారు. 21 తేదీన ఆయన ఆరోగ్య పరిస్థితి, వీడియో గ్రఫి, స్టేట్‌మెంట్‌ను షీల్డ్ కవర్‌లో పెట్టి న్యాయధికారి సుప్రీం కోర్టుకు అందజేయనున్నారు.