పోలీసు విచారణలో భర్తను వెనుకేసుకొచ్చిన శిల్పా
విధాత : పోర్నోగ్రఫీ కేసులో విచారణను వేగవంతం చేశారు ముంబై పోలీసులు. ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా భార్య, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిని శుక్రవారం సాయంత్రం విచారించి, ఆమె స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. విచారణ సందర్భంగా ఆమె తన భర్తను వెనకేసుకొచ్చినట్లు సమాచారం. రాజ్‌కుంద్రా అమాయకుడని, ‘ఎరోటికా’కు ‘పోర్న్’కు తేడా ఉందని, ‘ఎరోటికా’..‘పోర్న్’ కాదని ఆమె అన్నట్లు తెలుస్తోంది. యాప్ నిర్వహణ లండన్‌లో ఉన్న రాజ్‌కుంద్రా బావమరిది ప్రదీప్ భక్సిదని ఆమె చెప్పినట్లు సమాచారం. […]

విధాత : పోర్నోగ్రఫీ కేసులో విచారణను వేగవంతం చేశారు ముంబై పోలీసులు. ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా భార్య, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిని శుక్రవారం సాయంత్రం విచారించి, ఆమె స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. విచారణ సందర్భంగా ఆమె తన భర్తను వెనకేసుకొచ్చినట్లు సమాచారం. రాజ్‌కుంద్రా అమాయకుడని, ‘ఎరోటికా’కు ‘పోర్న్’కు తేడా ఉందని, ‘ఎరోటికా’..‘పోర్న్’ కాదని ఆమె అన్నట్లు తెలుస్తోంది. యాప్ నిర్వహణ లండన్‌లో ఉన్న రాజ్‌కుంద్రా బావమరిది ప్రదీప్ భక్సిదని ఆమె చెప్పినట్లు సమాచారం. కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్‌కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.