Parliament | కొత్త భవనాన్ని పార్లమెంటు హౌస్ అని పిలవరా? ఏమని పిలుస్తారు?
Parliament | పరిశీలనలో ఈ మహా నాయకుల పేర్లు ఉంటాయా? ప్లకార్డులతో నిరసనలకు ఇక అవకాశం లేదా? కొత్త పార్లమెంటులో కొత్త సంగతులు విధాత : కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తున్నది. కొత్త భవంతిలోని లోక్‌సభ లేదా రాజ్యసభ హాళ్లలో సీటింగ్ విధానం, సభాధ్యక్షుడి చైర్ ఉండే ఎత్తు గమనిస్తే.. వందమంది నిలబడినా లైవ్ టెలికాస్ట్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తున్నదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒక విధంగా సభ్యుల నిరసనకు […]

Parliament |
- పరిశీలనలో ఈ మహా నాయకుల పేర్లు ఉంటాయా?
- ప్లకార్డులతో నిరసనలకు ఇక అవకాశం లేదా?
- కొత్త పార్లమెంటులో కొత్త సంగతులు
విధాత : కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తున్నది. కొత్త భవంతిలోని లోక్‌సభ లేదా రాజ్యసభ హాళ్లలో సీటింగ్ విధానం, సభాధ్యక్షుడి చైర్ ఉండే ఎత్తు గమనిస్తే.. వందమంది నిలబడినా లైవ్ టెలికాస్ట్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తున్నదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ఒక విధంగా సభ్యుల నిరసనకు ఇక కొత్త పార్లమెంటులో అవకాశం లేనట్టే. ప్రస్తుత సభల్లో సభాధ్యక్ష స్థానాలతో పోల్చితే.. నూతన భవంతిలో చైర్‌లు చాలా ఎత్తున ఉన్నాయి. అంతేకాదు.. ఉభయ సభల్లోని వెల్.. పేరుకు తగినట్టే బావులంత లోతు ఉన్నాయి. ప్రస్తుత పార్లమెంటులో 1, 2, 3.. అంటూ నెంబర్లతో ప్రవేశ ద్వారాలు ఉంటే.. కొత్త భవంతిలో మూడు ప్రవేశ మార్గాలు పెట్టి.. జ్ఞాన ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని వాటికి నామకరణం చేశారు.
పార్లమెంటు హౌస్ కాదు! వేరే పేరుతో పిలుస్తారా?
కొత్త పార్లమెంటు భవనానికి కొత్త పేరు పెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చడంతోపాటు ముఖ్యమైన మార్గాల పేర్లను ఎన్డీఏ సర్కారు మార్చివేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పార్లమెంటు కొత్త భవనానికి కూడా పేరు పెడతారని చెబుతున్నారు. భారతదేశానికి సంబంధించిన మహోన్నత నాయకులైన మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్, సర్దార్ పటేల్‌తోపాటు.. చాణిక్య పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
పాత భవంతిని ఏం చేస్తారు?
పాత పార్లమెంటు భవనంలో ఉన్న కార్యాలయాలు అన్నీ పూర్తి స్థాయిలో కొత్త భవంతిలోకి మారిపోయిన తర్వాత పాత భవంతిని ‘మ్యూజియం ఆఫ్ డెమోక్రసీ’గా మార్చేందుకు చర్యలు మొదలవుతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.