నవీన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కరవు: తాప్సీ

  • By: Somu    news    Oct 13, 2023 11:11 AM IST
నవీన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కరవు: తాప్సీ

విధాత : నవ్యతతో కూడిన ఆలోచనలను, అర్ధవంతమైన ప్రయోగాలను ప్రయత్నించే స్థితిలో ప్రస్తుతం బాలీవుడ్‌ లేదని, నా వంటి వారు అలాంటి ప్రయత్నాలు చేసిన ప్రోత్సాహం లభించదని, ఇలాంటి వైఖరి మారాలని హిరోయిన్ తాప్సీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారాయి. తెలుగు సహా పలు భాషా చిత్రాల్లో నటించి హిందీ సినిమాల్లో భారీ చిత్రాల్లో , పెద్ద స్టార్లతో సినిమాలు చేసిన తాప్సీ ఇటీవల నిర్మాతగా కూడా మారింది.


ధక్ ధక్ అనే చిత్రాన్ని నిర్మించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయలను సూటిగా వెల్లడించిన తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. నిర్మాతగా మారాక తనకు కొన్ని అపోహలు తొలగిపోయాయని, సినిమాకు కథే హీరో అన్న మాటలు నిజం కాదని, కథ ఒక్కలైన్ చెప్పగానే హీరో ఎవరని అడుగుతున్నారని తాప్సీ చెప్పింది. నేను హిరోయిన్‌గా చేసినప్పుడు నా సహానటులు ఎవరు, నిర్మాతలు ఎవరు అని చ అడుగలేదన్నారు.


అలాగే ఓటీటీలు వచ్చాకా చిన్న సినిమాలకు గడ్డు కాలం ఏర్పడిందని, విడుదలకు ముందే తక్కువ ధరకు చిన్న సినిమాలు ఓటీటీలు కొనుగోలు చేస్తుండటంతో వాటిని విడుదల చేయడం కష్టమవుతుండటం ఇండస్ట్రీని దెబ్బతీస్తుందన్నారు. పెద్ద చిత్రాలకు మాత్రమే కావాల్సిన ప్రచారం చేస్తున్నారని,


దీంతో చిన్న సినిమాల విజయం కష్టమైందన్నారు. ఈ పరిణామాలు హీరోల మద్య గ్యాప్ పెంచుతుందని, చిన్న సినిమాల హీరోలు, పెద్ద హీరోలుగా పరిస్థితి మారిపోయి వినూత్న ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి