దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్!

విధాత, హైదరాబాద్ : దివ్యాంగులకు వివాహప్రోత్సాహక సహాయంపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటిదాక వివాహం చేసుకున్న జంటలో ఒకరు దివ్యాంగులుంటేనే ప్రభుత్వం రూ. 1లక్ష ఆర్థిక సహాయాన్ని వివాహ ప్రోత్సాహ పథకం కింద అందించేది. అయితే ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ఈ పథకం వర్తించేది కాదు.
ఈ నేపథ్యంలో పథకం విధి విధానాలను సమీక్షించిన మంత్రి సీతక్క దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాలను మార్చాలని నిర్ణయించారు.
ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా కూడా వివాహ ప్రోత్సాహం ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దివ్యాంగుల పెళ్లిళ్లకు ఆర్థిక ప్రోత్సాహం అందనుండటం పట్ల దివ్యాంగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!