తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ త‌గ్గేనా..! 22 రాష్ట్రాల్లో అమ‌లు

విధాత‌: పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంధనం చౌకగా మారింది, రికార్డు ధరలతో తీవ్రంగా నష్టపోయిన వినియోగదారులకు ఈ వారం ప్రారంభంలో కేంద్రం అందించిన ఉపశమనంతో పాటు. దాదాపు 22 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు (UTS) ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి, లీటరుకు రూ.2 నుంచి 7 రూపాయ‌ల వ‌ర‌కు అదనపు తగ్గింపును అందించ‌గా, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ […]

తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ త‌గ్గేనా..! 22 రాష్ట్రాల్లో అమ‌లు

విధాత‌: పలు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంధనం చౌకగా మారింది, రికార్డు ధరలతో తీవ్రంగా నష్టపోయిన వినియోగదారులకు ఈ వారం ప్రారంభంలో కేంద్రం అందించిన ఉపశమనంతో పాటు. దాదాపు 22 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు (UTS) ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి, లీటరుకు రూ.2 నుంచి 7 రూపాయ‌ల వ‌ర‌కు అదనపు తగ్గింపును అందించ‌గా, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్రం ఆ ఊసే ఎత్త‌డం లేదు. బిజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ‌గా ఈ అద‌న‌పు త‌గ్గింపు నిర్ణ‌యం తీసుకున్నాయి. కానీ ప్ర‌తిప‌క్ష పార్టీలు పాల‌న చేస్తున్న రాష్ట్రాలు ఎక్కువగా వ్యాట్‌ని తగ్గించలేదు.

ఇప్పుడు లీటర్‌ పెట్రోల్‌పై పన్నుల ద్వారా రూ.28.49…. ప్రతి లీటర్‌ డీజిల్‌పై రూ.21.78 ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతున్నాయి. రాష్ట్రంలో చివరిసారిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై విధిస్తున్న సుంకాలను గతేడాది జూలై 20వ తేదీన ప్రభుత్వం సవరించింది. లీటరు పెట్రోల్‌ రూ. 1.24, డీజిల్‌పై రూ. 0.93 పెంచారు. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.600 కోట్ల వార్షిక ఆదాయం లభిస్తోంది.

టీడీపీ హయాంలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అదనంగా 2 రూపాయల వ్యాట్‌ వసూలు చేసేది. జగన్‌ అధికారంలోకి వచ్చాక.. 4 రూపాయలకు పెంచారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌ వసూలు చేస్తోంది. అదనంగా వసూలు చేస్తున్న 4 రూపాయల వ్యాట్‌ను , రోడ్డు అభివృద్ధి సెస్సును రద్దు చేసుకున్నా లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రాష్ట్రంలో రూ5 పైగా తగ్గుతాయి.

ఈ ఏడాది సెప్టెంబర్​ మొదటివారం నుంచి ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. అప్పటి నుంచి పెట్రోల్‌ ధర రూ. 8.85 వరకు పెరిగింది. నిరుడు రూ. 19.98 వరకు ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీని క్రమంగా రూ. 32.9కు పెంచింది కేంద్రం. ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బిజేపీకి ఎదురుగాలి వీచింది. ఈ సంద‌ర్భంలోనే దీపావ‌ళి కానుక‌గా కేంద్రం లీటరు పెట్రోలుపై రూ.5, లీట‌రు డీజిల్‌పై రూ.10 లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా వారి ప‌న్నుల‌ను త‌గ్గిస్తే ప్ర‌జ‌ల‌కు మ‌రింత ఊర‌ట క‌లుగుతుంద‌ని కోరింది. కేంద్రం నిర్ణ‌యం తరువాత దేశంలోని అనేక బిజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అద‌న‌పు త‌గ్గింపు నిర్ణ‌యంతో ముందుకువ‌చ్చాయి.
పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్​ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో.. రాష్ట్రాలు వ్యాట్​ను తగ్గించేందుకు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా వాహనదారులపై భారం పడకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనతో అసోం, త్రిపుర, కర్నాటక, గోవా, బీహార్​ ప్రభుత్వాలు స్పందించాయి. పెట్రోల్​, డీజిల్​పై అసోం, త్రిపుర, కర్నాటక, గోవా ప్రభుత్వాలు వ్యాట్​ను రూ. 7 తగ్గించాయి. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనతో పెట్రోల్​ ధర రూ. 12 , డీజిల్ ధర రూ. 17 తగ్గే అవకాశం ఉంది. బీహార్​ ప్రభుత్వం పెట్రోల్​పై రూ. 1.30, డీజిల్​పై రూ. 1.90 తగ్గించింది. అయితే.. మన తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇంధనం యొక్క బేస్ ధర మరియు ఎక్సైజ్ పన్నుపై వ్యాట్ వర్తిస్తుంది కాబట్టి కేంద్రం సుంకం తగ్గింపు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటుంది.
ఒడిశా, కర్ణాటక, పుదుచ్చేరి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ నాగాలాండ్, త్రిపుర‌, అస్సాం, సిక్కిం, బీహార్ మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, దాద్రా & నగర్ హ‌వేలి, డామన్ వంటి చోట్ల‌ పెట్రోలియం ఇంధనాలపై అద‌న‌పు త‌గ్గింపులు అమ‌ల్లోకి వ‌చ్చాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన‌డయ్యూ, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము & కాశ్మీర్‌ల‌లో సైతం అద‌న‌పు ప‌న్నులు త‌గ్గించి ఊర‌ట క‌లిగించారు.
కేంద్రం దీపావ‌ళి ముందు రోజు రాత్రి అంటే న‌వంబ‌ర్ 3న పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని రూ. 5, రూ. 10 తగ్గించింది, దాంతో శుక్రవారం మరిన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించాలనే నిర్ణయంతో గుజరాత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెండూ లీటరుకు అదనంగా రూ. 7 తగ్గాయి. శుక్రవారం, బెంగళూరులో పెట్రోల్, డీజిల్ రెండు ధరలు లీటరుకు దాదాపు రూ.7 తగ్గాయి. భోపాల్‌లో పెట్రోలు ధర రూ.5.46 తగ్గగా, డీజిల్ రూ.4.66 తగ్గింది.