రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించడం తగదు
విధాత:కృష్ణా, గోదావరి నదీజలాల సమస్యపై కేంద్రం అతి జోక్యంతో రెండు రాష్ట్రాల లో ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన ప్రాజెక్టులు తన పరిధిలోకి తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, వాటిని తామే నిర్వహిస్తామని ప్రకటించడం విస్మయానికి గురి చేస్తుందన్నారు తమ్మినేని వీరభద్రం. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను ఆసరాగా చేసుకుని కేంద్రం పెత్తనం చేయడం రాష్ట్రాల హక్కులను కాలరాయడమే. ఇప్పటికే రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయం, సహకారం, విద్య, మరికొన్నింటిని కేంద్రం తన చేతిలోకి తీసుకుంది. […]

విధాత:కృష్ణా, గోదావరి నదీజలాల సమస్యపై కేంద్రం అతి జోక్యంతో రెండు రాష్ట్రాల లో ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన ప్రాజెక్టులు తన పరిధిలోకి తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, వాటిని తామే నిర్వహిస్తామని ప్రకటించడం విస్మయానికి గురి చేస్తుందన్నారు తమ్మినేని వీరభద్రం. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను ఆసరాగా చేసుకుని కేంద్రం పెత్తనం చేయడం రాష్ట్రాల హక్కులను కాలరాయడమే. ఇప్పటికే రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయం, సహకారం, విద్య, మరికొన్నింటిని కేంద్రం తన చేతిలోకి తీసుకుంది. రాష్ట్రాలపై మరింత పెత్తనం చేసే ఈ చర్యను సిపిఐ(యం) వ్యతిరేకిస్తున్నది. నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాలు గొడవ పడితే అవసరమైన కమిటీలు, ట్రిబ్యునల్స్ లేదా స్టాండింగ్ ఆర్డర్స్ అమలుచేయాలి. లేదా రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కరించాలి తప్ప పంచాయితీ తీర్చమని కోరితే హక్కులను గుంజుకుని అధికారం చెలాయిస్తామన్న కేంద్ర ప్రభుత్వ విధానం ఫెడరల్ హక్కులకు భంగం కలిగిస్తుంది.