Vande Bharat Express | ఇక 7 గంటల్లోనే బెంగళూరుకు.. రూట్ ఖరారు..! వచ్చే నెలలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి..!
Vande Bharat Express | దక్షిణ మధ్య రైల్వేలో మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్ - తిరుపతి - సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య మరో రైలు అందుబాటుకి రానున్నది. ఈ మేరకు రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ రైలు రూట్ మ్యాప్‌ను […]

Vande Bharat Express |
దక్షిణ మధ్య రైల్వేలో మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో సికింద్రాబాద్ – బెంగళూరు మధ్య మరో రైలు అందుబాటుకి రానున్నది.
ఈ మేరకు రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ రైలు రూట్ మ్యాప్‌ను దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ – బెంగళూరు మధ్య దాదాపు ఏడు రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 11 గంటల వరకు పడుతుంది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏడు గంటల్లోపే చేరుకులా అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు రెండు మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు మీదుగా ఓ మార్గం.. మరో మార్గంలో మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా రైలు సర్వీసులు నడుస్తున్నాయి.
ప్రస్తతం కాచిగూడ-బెంగళూరు మీదుగానే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ట్రాక్ సామర్థ్యం, రైలు వేగంపై రైల్వే అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ రైలును మే 21న ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది.
ఇక రైలు నడిచే సమయం, టికెట్ల ధరలపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని సమాచారం. త్వరలోనే రైలు షెడ్యూల్‌ను, టికెట్ ధరలను ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ క్రమంలోనే బెంగళూరుకు మరో వందే భారత్ రైలును తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తున్నది.