జస్ట్ ఇమాజిన్ : బిగ్ బాస్ కంటెస్టంట్ గా ఆర్జివి వెళ్తే..!

తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని బిగ్ బాస్ రియాలిటీ షోని తెలుగు వారికి అందించారు స్టార్ మా నిర్వాహకులు. వాయిస్ మాత్రమే వినిపించి కంటెస్టంట్స్ కు టాస్కులు ఇచ్చే బిగ్ బాస్ షోకి సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ వస్తే ఎలా ఉంటుంది. అబ్బో ఆలోచనే భలే థ్రిల్ అనిపిస్తుంది కదా.. మీడియా ఇంటర్వ్యూలకే ఒకదానికి పది సమాధానాలతో చెప్పి కన్ ఫ్యూజ్ చేసే వర్మ బిగ్ బాస్ కు వెళ్తే మాత్రం అది […]

జస్ట్ ఇమాజిన్ : బిగ్ బాస్ కంటెస్టంట్ గా ఆర్జివి వెళ్తే..!

తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని బిగ్ బాస్ రియాలిటీ షోని తెలుగు వారికి అందించారు స్టార్ మా నిర్వాహకులు. వాయిస్ మాత్రమే వినిపించి కంటెస్టంట్స్ కు టాస్కులు ఇచ్చే బిగ్ బాస్ షోకి సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ వస్తే ఎలా ఉంటుంది. అబ్బో ఆలోచనే భలే థ్రిల్ అనిపిస్తుంది కదా.. మీడియా ఇంటర్వ్యూలకే ఒకదానికి పది సమాధానాలతో చెప్పి కన్ ఫ్యూజ్ చేసే వర్మ బిగ్ బాస్ కు వెళ్తే మాత్రం అది నిజంగా సంచలనమే..

ఒకవేళ ఆర్జివి బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్ గా వెళ్తే ఎవడో కనిపించని వాడు ఇచ్చే టాస్కులు నేనెందుకు చేయాలి. అతనికి దమ్ముంటే తన ముందుకు వచ్చి తనతో మాట్లాడి గెలవమని చెబుతాడు కూడా.. టైటిల్ విన్నర్ అవడం కాదు ఆయన తల తిక్క ప్రవర్తనకు కంటెస్టంట్స్ అంతా కలిసి ముందే ఆయన్ను విజేతగా ప్రకటించేస్తారు. తను చేసే ఏ పనైనా లాజికల్ గా చూసే ఆర్జివి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో దిట్ట. బయట జరిగే ప్రతి విషయాన్ని తనకు పబ్లిసిటీ అయ్యేలా మార్చుకునే టాలెంట్ ఉన్న ఆర్జివి ఒకవేళ బిగ్ బాస్ షోకి వస్తే మాత్రం చాలా కష్టం.