Mrigasira Karthi: మృగశిర కార్తి రోజున చేపలు ఎందుకు తింటారు? దీని వెనక దాగున్న రహస్యం ఏమిటి?

Mrigasira Karthi: మృగశిర కార్తి ప్రారంభం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైనది. ఈ కార్తి ప్రారంభం రోజున మాంసాహార ప్రియులు కచ్చితంగా చేపలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఏడాది పొడవునా చాలా అరుదుగా చేపలను తినేవారు కూడా.. మృగశిర కార్తి రోజున చేపలు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇందుకు సంబంధించిన రహస్యం ఏమిటి? ఎందుకు ఈ రోజున చేపలను ఆహారంగా తీసుకుంటారు.. అన్న విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. ఈ ఆచారం వెనుక ఉన్న ప్రచారాలు. శాస్త్రీయఅంశాలు ఏమిటో తెలుసుకుందాం..
మృగశిర కార్తె ప్రారంభం రోజున వాతావరణం చల్లబడుతుంది. అప్పటివరకు ఎండలు దంచికొట్టినా ఆ రోజు మాత్రం వాతావరణం చల్లగా ఉంటుంది. వర్షాకాలం ప్రారంభం కావడమే అందుకు కారణం. అప్పటివరకు ఉన్న వేసవి తాపం ఆ రోజు తీరిపోతుంది.
ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో శరీరంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి.
వర్షాకాలం కావడంతో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం. వర్షాకాలంలో జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రోహిణి కార్తెలు ముగిసి, మృగశిర కార్తె మొదలైన మొదటి రోజే చేపలు తినడం ఆనవాయితీగా పూర్వం నుంచి కొనసాగుతోంది. చేపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని పెద్దలు నమ్ముతారు. అందుకే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు ఆహారంగా తీసుకోవడం అనవాయితీగా వస్తుందని చెబుతున్నారు.
చేపలు తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు
శీతాకాలం ప్రారంభంలో చేపలు తినడం వలన శరీరానికి తగిన వేడి లభిస్తుంది. చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొన్ని ప్రాంతాలలో, మృగశిర కార్తి రోజు చేపలు తినడం వలన అదృష్టం కలుగుతుందని కూడా నమ్ముతుంటటారు. ఈ కాలంలో నీటి వనరులు పుష్కలంగా ఉండటం వలన చేపలు సులభంగా లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో చేపలు పట్టడం, వాటిని వండుకోవడం ఒక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది.