కరోనా చికిత్స పొందుతూ ప్రసవించిన టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ భార్య..విషమ పరిస్థితులలో ఆదుకున్న డిఐజి
విధాత:పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడం లో రాష్ట్ర డీజీపీ, అనంతపురం రేంజి డిఐజి చొరవ తీసుకుని,గర్భవతి అయిన టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ భార్యకు ఆపరేషన్ చేయించి, పూర్తిగా కొలుకునేంత వరకు అండగా నిలిచారు. రైల్వే కోడూరు లోని టాస్క్ ఫోర్స్ సబ్ కంట్రోల్ కానిస్టేబుల్ పి. సుజయ్ కుమార్ (పి సి 694) భార్య సంధ్య కు ఏప్రిల్ 25న పాజిటివ్ వచ్చింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి. ఆమెను కడప రిమ్స్ […]

విధాత:పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడం లో రాష్ట్ర డీజీపీ, అనంతపురం రేంజి డిఐజి చొరవ తీసుకుని,గర్భవతి అయిన టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ భార్యకు ఆపరేషన్ చేయించి, పూర్తిగా కొలుకునేంత వరకు అండగా నిలిచారు. రైల్వే కోడూరు లోని టాస్క్ ఫోర్స్ సబ్ కంట్రోల్ కానిస్టేబుల్ పి. సుజయ్ కుమార్ (పి సి 694) భార్య సంధ్య కు ఏప్రిల్ 25న పాజిటివ్ వచ్చింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి. ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఈ విషయాన్ని డిఐజి క్రాంతి రాణా టాటా, డీజీపీ గారి దృష్టి కి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో డిఐజి ఆమెను తిరుపతి కి వెంటిలేటర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. ఆసుపత్రిలలో బెడ్లు ఖాళీ లేకపోయినా అంకుర ఆసుపత్రి యాజమాన్యం తో మాట్లాడి చేర్పించారు.
ఎప్పటికప్పుడు డాక్టర్లు తో డిఐజి గారు మాట్లాడుతూ ఆమెకు ఆపరేషన్ చేయించారు.ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను 25 రోజుల పాటు ఆసుపత్రిలో సంరక్షించారు. ఆమెను సోమవారం డిశ్చార్జి చేశారు. అయితే ఆమెకు ఇంట్లో కూడా ఆక్సిజన్ అవసరం అని డాక్టర్లు చెప్పడంతో, డీఐజీ గారు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను ఏర్పాటు చేసి, ఇంటికి పంపించారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తూ తల్లి బిడ్డను కాపాడారు. డీఎస్పీ మురళీధర్ మాట్లా6 డిఐజి గారు ప్రతి రోజు తన పరిధిలో ఉన్న సిబ్బంది గురించి ఆరా తీస్తూ, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ, తగిన విధంగా స్పందిస్తున్నారని తెలిపారు. కానిస్టేబుల్ సుజయ్ కుమార్ తన భార్యను రక్షించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.