మీరు సీఎం అవుతారు.. ఎమ్మెల్సీ కవితకు సోది జోస్యం

  • By: sr    news    May 12, 2025 7:48 PM IST
మీరు సీఎం అవుతారు.. ఎమ్మెల్సీ కవితకు సోది జోస్యం

విధాత : రాబోయే కాలంలో మీరు సీఎం అవుతారంటూ ఎమ్మెల్సీ కవితకు ఎరుకుల నాంచారమ్మ సోది జోస్యంలో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కవిత సోమవారం చారిత్రక రామప్ప ఆలయంలో రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకుముందు ములుగు జిల్లా రామానుజపురంలో ఎరుకల కులస్తుల ఆరాధ్య దైవమైన నాంచారమ్మ జాతరలో కవిత పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఎరుకల నాంచారమ్మలు కవిత చేయి చూసి సోది జోస్యం చెప్పారు.  భవిష్యత్తులో మీరు సీఎం అవుతారంటూ వారు సోది చెప్పడంతో కవిత మురిసిపోయారు. జై తెలంగాణ అంటూ నినదించారు. కాగా కవిత ఇదే రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న నాపై.. సొంత పార్టీ నేతలే పనిగట్టుకుని దుష్ఫ్రాచారం చేస్తున్నారని.. వారెవరో నాకు తెలుసని.. సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

ఇదే సమయంలో ఆమె సీఎం అంటూ సోది అమ్మ జోస్యం చెప్పడాన్ని ఆమె అనుచరులు వైరల్ చేస్తున్నారు. సీఎం కోరికను పరోక్షంగా బయట పెట్టిన కవితక్క! కవితకు ఎరుకల నాంచారమ్మ సోది జోస్యంపై కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామా రాంమోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. సీఎం కావాలనే కోరికను పరోక్షంగా కవితక్క బయట పెట్టుకుందన్నారు. ప్రచార స్టంట్ లో భాగంగా ముందే జోస్యం చెప్పే వాళ్లకు స్క్రిప్ట్ ఇచ్చి , వాళ్ళతో ప్రత్యేకంగా సీఎం అని చెప్పించుకుని తన కుటుంబానికి సోషల్ మీడియా వేదికగా సందేశం ఇచ్చారంటూ సామా పోస్టు చేశారు.