ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ
విధాత : మహమ్మారి కరోనా విలయతాండవం సమయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. నవ ప్రభుత్వాల కర్తవ్యాల పేరుతో రఘురామ నాలుగో లేఖ రాశారు.కరోనా దృష్ట్యా పరీక్షల రద్దుపై ఈనెల 1న ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. కరోనా బారి నుంచి పిల్లలను కాపాడేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అన్ని రాష్ట్రాలు బోర్డు పరీక్షల రద్దు ప్రకటించాయన్నారు.ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు […]

విధాత : మహమ్మారి కరోనా విలయతాండవం సమయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. నవ ప్రభుత్వాల కర్తవ్యాల పేరుతో రఘురామ నాలుగో లేఖ రాశారు.కరోనా దృష్ట్యా పరీక్షల రద్దుపై ఈనెల 1న ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. కరోనా బారి నుంచి పిల్లలను కాపాడేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అన్ని రాష్ట్రాలు బోర్డు పరీక్షల రద్దు ప్రకటించాయన్నారు.ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించాలనే స్థిర నిర్ణయంతో ఉందన్నారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకుండా తక్షణం నిర్ణయం తీసుకోవాలన్నారు.
నేడే ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలపాలని రఘురామ పేర్కొన్నారు.