ఏపీ ప్రభుత్వ రుణవ్యవహారాలపై కేంద్రం కాగ్ తో విచారణ జరిపించాలి.. పయ్యావుల కేశవ్

రూ.25వేలకోట్ల రుణంకోసం, జగన్ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా వెళుతోంది.ఏపీ ప్రభుత్వ రుణవ్యవహారాలపై కేంద్రం కాగ్ తో విచారణ జరిపించాలి. • రాష్ట్రప్రభుత్వ రుణబాగోతాలపై కేంద్రం కాగ్ తో విచారణజరిపించాలి.• రూ.25వేలకోట్ల రుణానికి సంబంధించి ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలనుకూడా అతిక్రమించింది.• రూ.25వేలకోట్ల రుణం కోసం, దేశంలో ఏరాష్ట్రం చేయని సాహసం ఏపీ చేసింది.• శాసనసభకు తెలియకుండా, గవర్నర్ కార్యాలయాన్ని దారిమళ్లించి మరీ రుణాలకోసం అడ్డదారులు తొక్కారు.• పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా కేంద్రం స్పందించే […]

ఏపీ ప్రభుత్వ రుణవ్యవహారాలపై కేంద్రం కాగ్ తో విచారణ జరిపించాలి.. పయ్యావుల కేశవ్

రూ.25వేలకోట్ల రుణంకోసం, జగన్ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా వెళుతోంది.
ఏపీ ప్రభుత్వ రుణవ్యవహారాలపై కేంద్రం కాగ్ తో విచారణ జరిపించాలి.

• రాష్ట్రప్రభుత్వ రుణబాగోతాలపై కేంద్రం కాగ్ తో విచారణజరిపించాలి.
• రూ.25వేలకోట్ల రుణానికి సంబంధించి ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలనుకూడా అతిక్రమించింది.
• రూ.25వేలకోట్ల రుణం కోసం, దేశంలో ఏరాష్ట్రం చేయని సాహసం ఏపీ చేసింది.
• శాసనసభకు తెలియకుండా, గవర్నర్ కార్యాలయాన్ని దారిమళ్లించి మరీ రుణాలకోసం అడ్డదారులు తొక్కారు.
• పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా కేంద్రం స్పందించే వరకు గవర్నర్ కార్యాలయ ఏంచేసింది?
• ప్రభుత్వాలు నడపడానికి అప్పులు చేయడమనేది సాధారణమే.
• కానీ ఎడాపెడా , నిబంధనలు, రాజ్యాంగ సూత్రాలు పట్టించుకోకుండా, వ్యవస్థలను తుంగలో తొక్కేలా చేస్తేఎలా?
• ఎవరో తీసుకునే అప్పులపై తాను సంతకం పెడతానంటే బ్యాంకులు అప్పులిస్తాయా?
• బ్యాంకులకు ఉన్న లీగల్ సలహా విభాగాలు ప్రభుత్వంచెప్పింది ఎలా నమ్మాయి?
• ఎవరు ఎవరిని మోసగించే ప్రయత్నం చేశారో తేలాలి.
• రాష్ట్రప్రభుత్వం ఖజానాకు రావాల్సిన నిధిని నేరుగా బ్యాంకులకే ఇస్తామని సంతకాలు పెట్టింది.
• ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థ ముసుగులో రాష్ట్రప్రభుత్వం పెద్దతప్పుచేసింది.
• వ్యవస్థలు బలోపేతం కావాలనే తాముకోరుకుంటున్నాము తప్ప, ప్రభుత్వాన్ని తప్పుపట్టడంలేదు.
• రాష్ట్రప్రభుత్వ తప్పులను తాము ఎత్తిచూపేవరకు కేంద్రం ఎందుకు స్పందించడంలేదు?

పయ్యావుల కేశవ్ (పీఏసీ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే)

విధాత:రాష్ట్రప్రభుత్వ ఆర్థిక అవతవలకు సంబంధించిన అనేక విషయాలను ఇప్పటికే బహిర్గతంచేశామని, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని, టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావులకేశవ్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా…!
రూ.41వేల కోట్లచెల్లింపులకు బిల్లులులేకపోవడం కావచ్చు, రూ.17వేలకోట్లు అదనంగా డ్రా చేయడ కావచ్చు, రూ.25వేలకోట్ల రుణాలకు సంబంధించిన వ్యవహారం గానీ ఏదీ సరిగాలేదని చెప్పాము.
భవిష్యత్ తరాలకు సంబంధించిన ఆదాయాన్ని చూపించి అప్పులుతేవడం తప్పని తాము చెప్పాము. కేంద్రంకూడా అది తప్పని దానిలో కుట్ర ఉందని చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 ప్రకారం, రాజ్యాంగవిరుద్ధమని చెప్పారు. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో ఇష్టానుసారం అప్పులు తెస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ,ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ తప్పుచేసింది. రాజ్యాంగ మౌలికసూత్రాలను కూడాపక్కనపెట్టి, అప్పులకోసం ఈ విధమైన చట్టాలు ఎలాచేస్తారు? రాష్ట్రప్రభుత్వ ఆర్థికవ్యవస్థపై సీఏజీ (కాగ్) తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. రుణాలిచ్చిన బ్యాంకులపై కూడా కేంద్రప్రభుత్వం అత్యున్నత సంస్థతో విచారణ జరిపించాలి. తమకేమీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకతలేదు.

అలాంటి ఆలోచనలతో తాము విచారణలు కోరడంలేదు. భవిష్యత్ తరాలకు చెందాల్సిన సంపదను ఈవిధంగా దుర్వినియో గం చేయడమేంటి? వ్యవస్థలను కుప్పకూల్చే ప్రయత్నాలుచేస్తున్న ప్రభుత్వా న్ని అడ్డుకోవాల్సిన అవసరముంది. కేంద్రం కేవలం రెండు,మూడు అంశాలను మాత్రమే ప్రస్తావించింది. అదిచాలాచిన్నవిషయం మాత్రమే. ఇంకా పెద్దఎత్తున అనేక ఆర్థిక అంశాలలో అవకతవకలు జరిగాయి. రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకం గానే అప్పులుచేసింది.. చేస్తోంది. బడ్జెట్ కు సంబంధించిన అవసరాలను ప్రభుత్వం బడ్జెట్లోచూపాలి కదా? హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పేరుతో చేస్తున్న అప్పులను ఏరకంగా సమర్థించుకుంటారు? ఏపీప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవ లప్ మెంట్ కార్పొరేషన్ యాక్ట్ అనేచట్టాన్ని తీసుకొచ్చింది. ఆచట్టాన్ని నమ్ముకొ నే అనేకసంస్థలు ప్రభుత్వానికి అప్పులిచ్చాయి. ఇప్పుడేం చెబుతున్నారు…. చట్టాన్ని అమెండ్ చేయకుండా, ఎస్క్రూ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు చట్టసవరణ చేయడం తప్పమరోమార్గం లేదు. అదేగానీచేస్తే, ప్రభుత్వం చేసు కున్న రహస్యఒప్పందాలు ఏవైతేఉన్నాయో, అవి చెల్లుబాటు అవుతాయా? బ్యాంకులు వాటిని కొనసాగిస్తాయా? రుణాలకోసం రాజ్యాంగవిరుద్ధంగా వెళుతు న్నారని తొలినుంచీ చెబుతున్నాం. దానికేమన్నారు…. పయ్యావుల కేశవ్ అమాయకుడు, అతనికేం తెలియదన్నారు. ఇప్పుడు ఎవరో ఇచ్చిన ఫిర్యాదు పై కేంద్రమే స్పందించింది. చూడగానే కళ్లకుకట్టినట్టు రాష్ట్రప్రభుత్వ తప్పులు కేంద్రానికి కనిపించబట్టే స్పందించింది. ఈ వ్యవహారంలోతుల్లోకి వెళితే ఇంకెన్ని తప్పులు కనిపిస్తాయో? బ్యాంకులు అతిపెద్దప్రమాదంలో చిక్కుకోబోతున్నా యి. ప్రభుత్వమిచ్చిన జీవోలకు, అగ్రిమెంట్లకు మధ్యకూడా తేడాలున్నాయి. ఎవరు ఎవరిని మోసంచేశారో తేలాలి. ఎవరెవరు కలిసి ఇందులో భాగస్వాములయ్యారు. ఇదంతా ముఖ్యమంత్రికి తెలుసా..మంత్రికి తెలుసా అనేది నేను చెప్పను. అధికా రులకు మాత్రం తెలిసే జరిగింది. పయ్యావులకేశవ్ కుతెలిసింది… అధికారులకు తెలియదా? ఏపీప్రభుత్వ రుణాలబాగోతం భారతదేశ ఆర్థిక చరిత్రలో అతిపెద్ద చర్చకు తెరతీయబోతోందని నెలక్రితమే చెప్పాను. రుణాలకోసం తప్పుడు నివేదికలు ఇప్పించుకోవడం ఈప్రభుత్వానికి కొత్తకాదు. భారత దేశంలో అతిపెద్ద లీగల్ స్క్రూటినీ సంస్థతో అనుకూలంగా నివేదిక ఇప్పించుకున్నారు కదా. తాను లేవనెత్తిన అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిగితే, దేశ రాష్ట్రాల ఆర్థికవ్యవస్థ లు ఎంతోబలపడతాయి.

ఈ వ్యవహారంలోని గుట్టుమట్లన్నీ బహిర్గతమైతే, వ్యవస్థలను బలోపేతం చేస్తుందితప్ప, ఈ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించాలని తాను మాట్లాడటంలేదు. ప్రభుత్వంలో ఉన్నవారు రెండురకాలుగా మాట్లాడుతు న్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తామెందుకు అప్పులుచేస్తామన్నారు.. అధికా రంలోకి వచ్చాక అప్పులు చేయకుండా ఎలా అంటున్నారు. తామేమీ అప్పులు చేయవద్దని చెప్పడంలేదు? గవర్నర్ పేరుతో సంతకాలు పెట్టడమేంటి? ప్రభుత్వం చేసిన చట్టాన్ని గవర్నర్ కార్యాలయానికి పంపినప్పుడు, సదరు చట్టం పై గవర్నర్ తనకార్యాలయసిబ్బందితో స్టడీ చేయించారా లేదా? గవర్నర్ కు సదరు చట్టాన్ని తిప్పిపంపే అధికారముంది. అదిచేయకుండా ప్రభుత్వం నుంచి ఏమొచ్చినా ఆమోదిస్తారా? గవర్నర్ కార్యాలయాన్ని ఒకటే కోరుతున్నాం. ఈ వ్యవహారం రాష్ట్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రమనేది భవిష్యత్ లో మనుగడ సాగించాలి. అలాంటి రాష్ట్రాన్ని, వ్యవస్థలను కుప్పకూల్చేలా ప్రభుత్వంపనిచేస్తుం టే, గవర్నర్ కార్యాలయం స్పందించదా? ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించిన అధి కారులపై ఎలాంటిచర్యలు తీసుకుంటారో చెప్పాలి. బ్యాంకులుకూడా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఈరోజు రూ.25వేలకోట్ల రుణమే… కానీ భవిష్యత్ లో మరిన్ని రుణవ్యవహారాలు జరుగుతాయి. బ్యాంకులకు ముందుముందు చాలా గడ్డుకాలం. ఈ ప్రభుత్వం, పాలకులుచేసిన అనాలోచిత చర్యలతో, చాలా నష్టం జరగనుంది. ప్రభుత్వాన్ని శాసించాలని తామేమీ అనుకోవడంలేదు. ప్రజలు ప్రభుత్వానికి అధికారమిచ్చారు. ప్రతిపక్షంగా తాము లోపాలను ఎత్తిచూపుతాం. వాటిని సరిచేసుకోకుండా, తమపై ఎదురుదాడిచేస్తే ఉపయోగం లేదు. కేంద్రప్రభుత్వం తక్షణమే ఈ వ్యవహారంపై కళ్లు తెరవాలి. రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా దీనిపై ఆలోచించాలి. వారుఫిర్యాదు చేస్తామన్నారు.

ఎవరిపై ప్రేమతో ఆపనిచేయలేదో తెలియడంలేదు. గవర్నర్ వ్యవస్థ లీగల్ ఫ్రేమ్ వర్క్ లోఉందా లేదా అనే అనుమానం తలెత్తే పరిస్థితి కల్పించారు. తామ ఫిర్యాదుచేశాక కూడా గవర్నర్ కార్యాలయం ప్రభుత్వాన్నివివరణ అడిగింది లేదు. చివరకు పత్రికలలో వచ్చిన కథనాలపై కేంద్రం స్పందించే వరకు వెళ్లింది. గతంలో గవర్నర్ కు ఏంచెప్పామో, ఇప్పుడు అదేచెబుతున్నాం. ఇదివరకు బుగ్గన చెప్పారు , ఢిల్లీకి వెళతారా అని… తాము ఢిల్లీ వెళ్లకుముందే, తమప్రకంప నలు ఢిల్లీ వెళ్లాయి. కేంద్రాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కచ్చితంగా ఏపీ రుణాలవ్యవహారంపై సీఏజీ (కాగ్) తో విచారణ జరిపించాలి. తాము ఇదివరకు అడిగితే బుకాయించారు.

తప్పుజరిగిందని ఒప్పుకుంటే ఏమవుతుంది? తప్పుజరిగిందని చెబితే, దాడిచేయడం ప్రభుత్వానికి మంచిదికాదు. తప్పులు తామూ చేస్తాము.. ప్రజలకు చెప్పుకుంటాము.. కానీ అడ్డగోలుగా ఏదిపడితే అదిమాట్లాడితేఎలా? ఎవరో తీసుకునే అప్పులపై తాను సంతకం పెడతానంటే బ్యాంకులు అప్పులిస్తాయా? బ్యాంకులకు ఉన్న లీగల్ సలహా విభాగాలు ప్రభుత్వంచెప్పింది ఎలా నమ్మాయి? ఎవరు ఎవరిని మోసగించే ప్రయత్నం చేశారో తేలాలి. రాష్ట్రప్రభుత్వం ఖజానాకు రావాల్సిన నిధిని నేరుగా బ్యాంకులకే ఇస్తామని సంతకాలు పెట్టింది. ఏపీస్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థ ముసుగులో రాష్ట్రప్రభుత్వం పెద్దతప్పుచేసింది. వ్యవస్థలు బలోపేతం కావాలనే తాముకోరుకుంటున్నాము తప్ప, ప్రభుత్వాన్ని తప్పుపట్టడంలేదు. రాష్ట్రప్రభుత్వ తప్పులను తాము ఎత్తిచూపేవరకు కేంద్రం ఎందుకు స్పందించడంలేదు?