Earth’s magnetic field | భూ అయస్కాంత క్షేత్రం బలహీనపడుతున్నదా? దానితో విపత్తులేంటి?
భూమికి అత్యంత కీలకమైన అయస్కాంత క్షేత్రం.. దక్షిణ అట్లాంటిక్ ప్రాంతంలో బలహీనపడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో చాలా నష్టాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Earth’s magnetic field | భూమి ఒక పెద్ద అయస్కాంతం అని చదువుకున్నాం. అయస్కాంత క్షేత్రం వల్లే భూమి భద్రంగా ఉంది. కానీ.. ఇప్పుడు ఆ అయస్కాంత క్షేత్రానికి (magnetic field) ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రంలో బలహీనమైన కేంద్రం పెరుగుతూ ఉండటం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇది ఉపగ్రహాల పనితీరును దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని, విద్యుత్తు సరఫరాను కూడా ప్రభావితం చేస్తుందని ఒక కొత్త అధ్యయనంలో వారు పేర్కొన్నారు.
eggs found in volcano | వేల గుడ్లను పొదుగుతున్న అగ్నిపర్వతం? ఎక్కడ.. ఆ కథేంటి?
భూమికి అత్యంత సంక్లిష్టమైన, డైనమిక్ మాగ్నటిక్ ఫీల్డ్ ధరణిపై అన్ని జీవరాసుల మనుగడకు చాలా ప్రధానమైనది. ఈ మాగ్నిటిక్ ఫీల్డ్.. రక్షణ వలయంగా మారి.. కాస్మిక్ రేడియేషన్ నుంచి, సూర్యుడి నుంచి వెలువడే చార్జడ్ పార్టికిల్స్ నుంచి కాపాడుతుంది. భూమి ఉపరితలం నుంచి 3వేల కిలోమీటర్ల లోతున ద్రవరూప ఇనుప మహా సముద్రం (molten liquid iron) ఉంది. ఇది నిరంతరం తిరుగుతూ ఉండేకారణంగా విద్యుత్తు ప్రవాహాలను సృష్టిస్తుంది. అవే మాగ్నిటిక్ ఫీల్డ్‌ను ఉత్పత్తి చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. సైకిల్‌కు ఉండే డైనమో తరహాలో పనిచేస్తుందన్నమాట. అయితే.. మాగ్నటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుందనే విషయం శాస్త్రవేత్తలకు ఇంకా పూర్తిగా అంతు చిక్కలేదు. దీనిపై మరిన్ని అధ్యయనాలు జరుగాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. ఉదాహరణకు.. దక్షిణార్ధ గోళంలో మాగ్నటిక్ ఫీల్డ్ ఒక పాయింట్‌లో చాలా బలంగా ఉండేది. ఉత్తరార్ధ గోళంలో అటువంటివి రెండు పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి కెనడా చుట్టూ, మరోటి సైబీరియా చుట్టూ ఉన్నాయి.
Comet 3I/ATLAS | ఆ తోకచుక్క భూమి వైపే దూసుకొస్తోందన్న ప్రచారంలో నిజమెంత?
2013లో భూమి కోర్ ప్రాంతం, మాంటిల్, క్రస్ట్, మహాసముద్రాల నుంచి, భూమి చుట్టూ ఉన్న వాతావరణ పొరల నుంచి వెలువడే అయస్కాంత సంకేతాలను కొలిచేందుకు ఒక తరహాలో ఉన్న మూడు ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటి నుంచి వచ్చిన డాటా ఆధారంగా భూమి అయస్కాంత స్వభావానికి సంబంధించిన అంశాలు పొందగలుగుతున్నారు. గత పదకొండేళ్లుగా ఇలా లభించిన సమాచారం భూమి అయస్కాంత క్షేత్రంలో బలహీనమైన ప్రాంతాన్ని గుర్తించారు. ఇది దక్షిణ అట్లాంటిక్ ప్రాంతంలో ఉన్నది. దీనికి ‘సౌత్ అట్లాంటిక్ అనామలీ’ అని నామకరణం చేశారు. 2014 నుంచి ఐరోపా ఖండంలో సగ భాగంతో సమానమైన ప్రాంతంలో ఈ బలహీన ప్రదేశం విస్తరిస్తున్నదని గుర్తించారని ఫిజిక్స్ ఆఫ్ ఎర్త్ అండ్ ప్లానెటరీ ఇంటీరియర్స్ అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం పేర్కొంటున్నది. ‘సౌత్ అట్లాంటిక్ అనామలీ అనేది కేవలం ఒక్క బ్లాక్ మాత్రమే కాదు.. అది దక్షిణ అమెరికాకు దగ్గరగా ఉండటం కంటే.. ఆఫ్రికా దిశగా మారుతున్నది. ఈ ప్రాంతంలో ఏదో జరుగుతున్నది. అది అయస్కాంత క్షేత్రాన్ని తీవ్రంగా బలహీనపరుస్తున్నది’ అని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్‌కు చెందిన క్రిస్ ఫ్లిన్లె చెప్పారు. ఆయన ఈ అధ్యయనం లీడ్ రైటర్. తాజా అధ్యయనం ప్రకారం.. సైబీరియాపై మాగ్నిటిక్ ఫీల్డ్ బలహీనపడుతుంటే.. మరోవైపు కెనడాపై బలహీనంగా మారుతున్నది. ఈ మార్పులు అంతరిక్షంలోని ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ సంకేతాలు, అంతరిక్ష వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also |
Suicide | పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
Kulfi Ice Cream | ‘కుల్ఫీ ఐస్‌క్రీమ్’తో కాసుల వర్షం.. ఏడాదికి రూ. కోటి సంపాదిస్తున్న మహిళ
Mega Tsunami | వెయ్యి అడుగల ఎత్తు కెరటాలతో.. అమెరికాపైకి మెగా సునామీ?
Universe End | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram