సిడ్నీకి వెళ్లనున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు

మాల్దీవుల్లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఆదివారం చార్టర్డ్‌ విమానంలో సిడ్నీకి బయల్దేరి వెళ్లనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, పాట్‌ కమిన్స్‌, రికీ పాంటింగ్‌, మైకేల్‌ స్లేటర్‌ తదితరులు భారత్‌ నుంచి మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. 38 మంది ఆసీస్‌ బృందం మాల్దీవుల నుంచి మలేషియా మీదుగా సిడ్నీకి మే16న ప్రత్యేక విమానంలో వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న […]

సిడ్నీకి వెళ్లనున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు

మాల్దీవుల్లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఆదివారం చార్టర్డ్‌ విమానంలో సిడ్నీకి బయల్దేరి వెళ్లనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, పాట్‌ కమిన్స్‌, రికీ పాంటింగ్‌, మైకేల్‌ స్లేటర్‌ తదితరులు భారత్‌ నుంచి మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. 38 మంది ఆసీస్‌ బృందం మాల్దీవుల నుంచి మలేషియా మీదుగా సిడ్నీకి మే16న ప్రత్యేక విమానంలో వెళ్లనున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న వీరింతా ఆదివారం ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లే అవకాశం ఉంది.
విదేశీ ప్రయాణికులు రాకుండా మే 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ గడువు శనివారంతో ముగియనుంది. నిషేధాన్ని పొడిగించకపోతే ఆసీస్‌ బృందం తమ దేశానికి వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది.