Cummins| పిల్ల‌ల‌తో స‌ర‌దాగా క్రికెట్ ఆడిన‌ క‌మ్మిన్స్ ..వీడియో వైర‌ల్

Cummins| ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు స‌న్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్నారు. కెప్టెన్ గా ప్యాట్ కమ్మిన్స్ కు తిరుగులే

  • By: sn    sports    May 18, 2024 11:48 AM IST
Cummins| పిల్ల‌ల‌తో స‌ర‌దాగా క్రికెట్ ఆడిన‌ క‌మ్మిన్స్ ..వీడియో వైర‌ల్

Cummins| ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు స‌న్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్నారు. కెప్టెన్ గా ప్యాట్ కమ్మిన్స్ కు తిరుగులేని రికార్డ్స్ ఉంది. ఆయ‌న కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మంచి విజ‌యాలు సాధిస్తుంది. ఎన్నో మెగా ట్రోఫీల‌ని కూడా ఆయ‌న అందించాడు. క‌మ్మిన్స్ ప‌ట్టింద‌ల్లా బంగారంలా మారుతుంది. ప్యాట్ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాషెస్ సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ 2023 లాంటి ఎన్నో మెగా ట్రోఫీలు అందించాడు. ఇప్పుడు స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌గా ఉన్న అత‌ను ఆ టీంకి క‌ప్ కూడా అందించ‌బోతున్నాడు అని ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

క‌మ్మిన్స్ టాలెంట్ గుర్తించిన కావ్య మార‌న్ అత‌నిని స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్‌గా నియ‌మించింది. ఆయ‌న నేతృత్వంలో జ‌ట్టు అద్భుతంగా రాణిస్తుంది. ఈ సారి క‌మ్మిన్స్ నేతృత్వంలో జ‌ట్టు క‌ప్ గెల‌వ‌డం ఖాయంగా కనిపిస్తుంది. అయితే కెప్టెన్ గా తిరుగులేని రికార్డ్స్ కలిగి ఉన్న కమ్మిన్స్.. సన్ రైజర్స్ కు కప్ అందిస్తాడా లేద అనే దానిపై కూడా జోరుగా చ‌ర్చ నడుస్తుంది. అయితే తాజాగా క‌మ్మిన్స్ హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను సంద‌ర్శించాడు. విద్యార్థుల‌తో క‌లిసి స‌ర‌దాగా ముచ్చ‌టించాడు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఉన్న గ్రౌండ్‌లో పిల్ల‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడాడు. స్వ‌త‌హాగా ఆల్‌రౌండ‌ర్ అయిన క‌మిన్స్‌.. వికెట్ కీపింగ్ కూడా చేయ‌డం విశేషం

క‌మ్మిన్స్ త‌న బ్యాటింగ్‌తో పిల్ల‌ల‌ను ఎంత‌గానో అల‌రించాడు. చిన్నారుల‌తో స‌మ‌యం గ‌డిపిన పాట్ క‌మిన్స్‌ను నెటిజ‌న్లు కొనియాడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గ‌నుక విజయం సాధిస్తే టాప్‌-2లో నిలిచే అవ‌కాశం ఉంది. మరోవైపు రాజ‌స్థాన్ త‌న చివ‌రి మ్యాచ్‌ను ఓడిపోవాల్సి ఉంటుంది.