Divya Deshmukh | ఫిడే ప్రపంచకప్ ఫైనల్ లో దివ్య దేశ్ ముఖ్ విజయం

ఫిడే మహిళల ప్రపంచ కప్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌లో దివ్య దేశ్‌ముఖ్‌ టైబ్రేకర్‌ గేమ్‌లో కోనేరు హంపిపై గెలిచారు. ఈ విజయంతో ఆమె ఫిడే మహిళల చెస్ టైటిల్‌ను గెలుచుకున్నారు.

Divya Deshmukh | ఫిడే ప్రపంచకప్ ఫైనల్ లో దివ్య దేశ్ ముఖ్ విజయం

Divya Deshmukh | ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ లో దివ్య దేశ్ ముఖ్ విజయం సాధించారు. కోనేరు హంపిపై ఆమె గెలిచారు.ఫిడే ప్రపంచకప్ ఫైనల్ టై బ్రేకర్ లో కోనేరు
హంపిపై దివ్య విజయం సాధించారు. ఫైనల్ లో రెండుసార్లు డ్రాగా ముగిసిన తర్వాత టైబ్రేకర్ లో ఆమె నెగ్గారు.ఈ గెలుపుతో భారత 88వ గ్రాండ్ మాస్టర్ గా ఆమె నిలిచారు.తొలిసారి ఫిడే మహిళల ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంది. ఈ విజయంతో 19 ఏళ్ల దివ్యకు గ్రాండ్ మాస్టర్ హోదా దక్కింది.

ఈ ఫైనల్ లో ఇద్దరు భారతీయులే పోటీపడ్డారు. దివ్య దేశ్ ముఖ్ మహారాష్ట్రకు చెందినవారు. 2005 డిసెంబర్ 9న నాగ్ పూర్ లోని జితేంద్ర, నమ్రత దంపతులకు దివ్య జన్మించారు. చిన్నప్పటి నుంచి దివ్యకు చెస్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. దీంతో ఆమె చెస్ లో రాణించారు. 2012లో అండర్-7లో నేషనల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు.

2022లో మహిళ ఇండియన్ చెస్ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నారు.అదే ఏడాది ఒలంపియాడ్ చెస్ లో కాంస్యం గెలుచుకున్నారు. 2020లో ఫిడే ఆన్ లైన్ చెస్ ఒలంపియాడ్ లో ఆమె గోల్డ్ మెడల్ నెగ్గారు. 2024 డిసెంబర్ లో ఉమెన్ చెస్ ప్లేయర్ లలో రెండో ర్యాంకులో నిలిచారు.