నల్ల బ్యాడ్జిలతో భారత ఆటగాళ్లు

విధాత,డుర్హమ్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేడు కౌంటీ సెలక్ట్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతోంది. మైదానంలోకి దిగిన భారత ఆటగాళ్లు మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ మృతికి సంతాపంగా చేతికి నల్లబ్యాడ్జ్‌లు ధరించారు. యశ్‌పాల్ శర్మ ఈ నెల 13న కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. 1983 ప్రపంచకప్ జట్టు గెలిచిన జట్టులో యశపాల్ సభ్యుడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సహచరుడు కూడా. భారత క్రికెటర్లు నల్లటి బ్యాడ్జ్‌లు ధరించిన ఫొటోలను బీసీసీఐ తన […]

నల్ల బ్యాడ్జిలతో భారత ఆటగాళ్లు

విధాత,డుర్హమ్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేడు కౌంటీ సెలక్ట్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతోంది. మైదానంలోకి దిగిన భారత ఆటగాళ్లు మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ మృతికి సంతాపంగా చేతికి నల్లబ్యాడ్జ్‌లు ధరించారు. యశ్‌పాల్ శర్మ ఈ నెల 13న కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. 1983 ప్రపంచకప్ జట్టు గెలిచిన జట్టులో యశపాల్ సభ్యుడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సహచరుడు కూడా. భారత క్రికెటర్లు నల్లటి బ్యాడ్జ్‌లు ధరించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అయిన యశ్‌పాల్ భారత్ తరపున 37 వన్డేలు, 42 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు.1979-83లో భారత జట్టులో మిడిలార్డర్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. రెండేళ్లపాటు భారత జట్టుకు సెలక్టర్‌గానూ సేవలు అందించాడు. కాగా, ప్రాక్టీస్ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చింది.

ఈ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.గాయం కారణంగా జట్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.