Kavya Maran|కావ్య పాప ఈ సారి మంచి ప్లేయ‌ర్స్ మీదే క‌న్నేసిందిగా.. లిస్ట్ ఇదే!

Kavya Maran|వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖ‌రారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ జ‌ర‌గ‌నుంది. ఈ మెగా వేలంలో ఏఏ ఫ్రాంచైజీలు ఏ ఆట‌గాళ్ల‌ని సొంతం చేసుకుంటుంది అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొని ఉంది. గత ఏడాది ఫినాలే వ‌ర‌కు

  • By: sn    sports    Nov 07, 2024 11:16 AM IST
Kavya Maran|కావ్య పాప ఈ సారి మంచి ప్లేయ‌ర్స్ మీదే క‌న్నేసిందిగా.. లిస్ట్ ఇదే!

Kavya Maran|వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖ‌రారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ జ‌ర‌గ‌నుంది. ఈ మెగా వేలంలో ఏఏ ఫ్రాంచైజీలు ఏ ఆట‌గాళ్ల‌ని సొంతం చేసుకుంటుంది అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొని ఉంది. గత ఏడాది ఫినాలే వ‌ర‌కు వ‌చ్చి కప్ జార‌విడుచుకున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈ సారి మాత్రం ప‌క్కా క‌ప్ కొట్టాల్సిందేనని డిసైడ్ అయింది. ఈ క్ర‌మంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ పదునైన వ్యహాలతో మెగా ఆక్షన్‌లో బరిలోకి దిగుతోంది. రిటైన్ లిస్ట్‌ను ప్రకటించడంలోనే ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ హాట్ టాపిక్ అయింది. హెన్రిచ్ క్లాసె‌న్‌కు అత్యధిక రూ.23 కోట్లు చెల్లించింది. ఇక మిగిలిన రూ.45 కోట్లతో సన్‌రైజర్స్ దాదాపు 20 మందిని కొనుగోలు చేయాల్సి ఉంది.

అయితే మెగా వేలంలో ఎవ‌రెవ‌రిని సొంతం చేసుకోవాల‌నే లిస్ట్ ఇప్పటికే కావ్య సిద్ధం చేసిన‌ట్టుగా తెలుస్తుంది. హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిలను రూ.75 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో స్థానం కోసం కేన్ విలియమ్సన్‌తో పాటు ఎయిడెన్ మార్క్‌రమ్‌లలో ఒకరిని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ మాజీ కెప్టెన్లు వేలంలో భారీ ధర పలికితే బ్యాకప్ ఆప్షన్‌గా రాహుల్ త్రిపాఠిని పెట్టుకుంది.ఇక నాలుగు, అయిదు స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌ ఖరారయ్యారు. దీంతో ఆరో స్థానంలో ఫినిషర్ రోల్ కోసం ఎవ‌రిని తీసుకోవాలా అని స‌న్‌రైజ‌ర్స్ ఆలోచిస్తుంది. తక్కువ ఖర్చులో దక్కే సర్ఫరాజ్ ఖాన్, అబ్దుల్ సమద్ వంటి ప్లేయర్లను తీసుకోవాలని చూస్తోంది.

ఇక స్పిన్న‌ర్స్ విష‌యంలో పెద్ద స్కెచ్చే వేసింది. కేకేఆర్ యువ స్పిన్నర్ సుయాష్ శర్మ, అన్‌క్యాప్డ్ ఆర్టీఎమ్ కార్డ్‌తో మయాంక్ మార్కండేను దక్కించుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తోంది. అలాగే అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌కు బిడ్ వేయాలని చూస్తోంది.నటరాజన్, భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి దక్కించుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. ఆ త‌ర్వాత ఖలీల్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్ ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.వారు దొర‌క‌ని ప‌క్షంలో ఆల్‌రౌండర్లుగా షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు వెంకటేశ్ అయ్యర్, అఫ్గాన్ ప్లేయర్ మహ్మద్ నబీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ ఆటగాళ్లతో పాటు తక్కువ ధరకు సొంతమయ్యే వాళ్లను తీసుకోవాలనుకుంటుంది.