Mumbai Indians| అధికారికంగా టోర్నీ నుండి నిష్క్ర‌మించిన ముంబై ఇండియ‌న్స్.. ఏఏ జ‌ట్లు రేసులో ఉన్నాయి..!

Mumbai Indians| ఐపీఎల్ 2024 17వ సీజన్ ఈ సారి మంచి రంజుగా సాగుతుంది. ఊహించిన జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కి కూడా చేరుకోవ‌డం లేదు. ఈ సారి విన్న‌ర్‌గా కొత్త జ‌ట్టుని చూస్తామా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. సీజ‌న్ 17 మార్చి 22న ఘనంగా ప్రారంభం కాగా, తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రా

  • By: sn    sports    May 09, 2024 9:20 AM IST
Mumbai Indians| అధికారికంగా టోర్నీ నుండి నిష్క్ర‌మించిన ముంబై ఇండియ‌న్స్.. ఏఏ జ‌ట్లు రేసులో ఉన్నాయి..!

Mumbai Indians| ఐపీఎల్ 2024 17వ సీజన్ ఈ సారి మంచి రంజుగా సాగుతుంది. ఊహించిన జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కి కూడా చేరుకోవ‌డం లేదు. ఈ సారి విన్న‌ర్‌గా కొత్త జ‌ట్టుని చూస్తామా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. సీజ‌న్ 17 మార్చి 22న ఘనంగా ప్రారంభం కాగా, తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ ప‌డ్డాయి. ఇందులో చెన్నై జ‌ట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇక ఆ త‌ర్వాత ఆయా జ‌ట్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్‌ల‌లో కొన్ని జ‌ట్లు 11 మ్యాచ్‌లు ఆడ‌గా, మరికొన్ని జ‌ట్లు 12 మ్యాచ్‌లు ఆడాయి. అయితే 12 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్ర‌మే గెలిచి 8 పాయింట్స్ సాధించిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమించింది.

 

బుధ‌వారం లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ త‌ల‌ప‌డ‌గా, ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్నందుకుంది. 62 బంతులు మిగిలి ఉండగానే ల‌క్ష్యాన్ని చేధించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఈ జ‌ట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌‌కు అడుగు దూరంలో మాత్ర‌మే నిలిచింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయంతో ముంబై ఇండియన్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా భారీ అప్రతిష్టను మూటగట్టుకుంది. మంచి రికార్డ్ ఉన్న ముంబై ఇండియన్స్ జ‌ట్టు ఇంత దారుణంగా నిష్క్ర‌మించ‌డం అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తుంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవ‌లం 4 విజయాలు మాత్రమే నమోదు చేసింది. చివరి రెండు మ్యాచ్‌లు గెలిచినా.. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం క‌ష్టం.

ఇక ప్ర‌స్తుతం టాప్-6లో ఉన్న జ‌ట్ట‌ల‌లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ దాదాపు ప్లే ఆఫ్స్‌కి చేరుకోవ‌డం ఖాయం. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ ప‌డ‌తాయి. చెన్నై జ‌ట్టుకి మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండ‌గా, ఈ మూడింట్లో ఆ జ‌ట్టు విజయం సాధిస్తే మాత్రం ప్లే ఆఫ్స్‌కి చేరుకోవ‌డంలో ఎలాంటి స‌మ‌స్య లేదు. ఒక్క‌టి ఓడిపోయిన మ‌ళ్లీ గణాంకాలు మార‌తాయి. చూడాలి మ‌రి టాప్ 4 స్థానం కోసం ఏ జ‌ట్టు వ‌స్తుంద‌నేది. ఇక . పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టాప్ 4 లోని మిగ‌తా మూడు జట్లలో 2 క్వాలిఫైయర్లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్‌లో పోటీపడతాయి. గెలుపొందిన జట్టు 2వ జట్టుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది.