నేడు గవర్నర్ ను కలవనున్న ఒలింపియన్స్
విధాత:టోక్యో ఒలింపిక్స్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలవనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, కాంస్య పతక విజేత పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి ఈ రజని లు సచివాలయంలో కలిశారు. శుక్రవారం గవర్నర్ ను నగరంలోని రాజ్ భవన్ లో పీవీ సింధు, ఈ రజని, సాత్విక్ సాయిరాజ్ కుటుంబ సభ్యులతో […]

విధాత:టోక్యో ఒలింపిక్స్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలవనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, కాంస్య పతక విజేత పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి ఈ రజని లు సచివాలయంలో కలిశారు. శుక్రవారం గవర్నర్ ను నగరంలోని రాజ్ భవన్ లో పీవీ సింధు, ఈ రజని, సాత్విక్ సాయిరాజ్ కుటుంబ సభ్యులతో కలవనున్నారు.