T20 World Cup| ఆస్ట్రేలియాకి కంగు తినిపించిన సౌతాఫ్రికా.. ఆసీస్ ఫైన‌ల్ చేర‌క‌పోవ‌డం ఇదే ప్ర‌ప్ర‌థ‌మం

T20 World Cup|  యూఏఈలో ప్ర‌స్తుతం మ‌హిళ‌ల టీ20 వ‌రల్డ్ క‌ప్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ టోర్నీ చివ‌రి ద‌శ‌కి చేరుకుంది. ఈ టోర్నీ నుండి ఇప్ప‌టికే భార‌త్ త‌ప్పుకుంది. ఇక గ‌త రాత్రి టోర్నీ తొలి సెమీఫైనల్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తే

  • By: sn    sports    Oct 18, 2024 9:18 AM IST
T20 World Cup| ఆస్ట్రేలియాకి కంగు తినిపించిన సౌతాఫ్రికా.. ఆసీస్ ఫైన‌ల్ చేర‌క‌పోవ‌డం ఇదే ప్ర‌ప్ర‌థ‌మం

T20 World Cup|  యూఏఈ(UAE)లో ప్ర‌స్తుతం మ‌హిళ‌ల టీ20 వ‌రల్డ్ క‌ప్(T20 world cup) జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ టోర్నీ చివ‌రి ద‌శ‌కి చేరుకుంది. ఈ టోర్నీ నుండి ఇప్ప‌టికే భార‌త్ త‌ప్పుకుంది. ఇక గ‌త రాత్రి టోర్నీ తొలి సెమీఫైనల్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఏకపక్షంగా ఓడించింది. దీంతో తొలిసారి ఫైన‌ల్‌కి చేరి చ‌రిత్ర సృష్టించింది. బ‌ల‌మైన జ‌ట్టుగా ఉన్న ఆస్ట్రేలియా ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు సార్లు టీ20 ప్రపంచకప్ నిర్వహించగా అందులో ఆరు సార్లు విజేతగా నిలిచింది. ఒకసారి ఫైనల్‌లో ఓటమిపాలైంది. ఈ సారి కూడా ఎలా అయిన ఫైన‌ల్ చేరి క‌ప్ ఎగ‌రేసుకుపోవాల‌నుకున్న వారి ఆశ‌ల‌కి సౌతాఫ్రికా(South Africa) క‌ళ్లెం వేసింది.

తొలి సెమీఫైనల్ (Semi Final)మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గాయపడిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ లేకుండానే సెమీస్‌లో బరిలోకి దిగింది. దీని ప్రభావం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌పై మరోసారి స్పష్టంగా కనిపించింది. పవర్‌ప్లేలో వేగంగా బ్యాటింగ్ చేసి ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో విఫ‌లం అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా(Australia) నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 134 పరుగులు చేసింది. బెత్‌ మూనీ (44; 42 బంతుల్లో, 2 ఫోర్లు ) టాప్‌స్కోరర్‌. ఎలిస్‌ పెర్రీ (31; 23 బంతుల్లో, 2 ఫోర్లు), తాలియా (27; 33 బంతుల్లో, 3 ఫోర్లు ) ఓ మాస్త‌రు ప‌రుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖకా రెండు వికెట్లు తీసింది. ఇక ల‌క్ష్య చేధ‌న‌లో ఎక్క‌డా కూడా సౌతాఫ్రికా త‌డ‌బ‌డింది లేదు.

దక్షిణాఫ్రికా 17.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. అనెకె బాష్‌ (74 నాటౌట్‌; 48 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌గా, కెప్టెన్ వోల్వార్ట్‌ (42; 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) మంచి స‌హకారం అందించింది. తన్జిమ్ బ్రిట్స్ (15; 15 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఆదిలోనే ఔటైనా వోల్వార్డ్, అనెకె.. ఆసీస్‌కు( Australia) ప‌ట్టు చిక్క‌కుండా చేశారు. వారిద్ద‌రు దూకుడుగా ఆడుతూ ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా పూర్తి చేశారు. అన్నెకే బాష్ (74 నాటౌట్), కెప్టెన్‌ లారా వోల్వార్డ్ 42 అద్భుత ఇన్నింగ్స్‌ల‌తో టీమ్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ఆస్ట్రేలియాతో గత ఏడాది ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ద‌క్షిణాఫ్రికా ఇలా ప్రతీకారం తీర్చుకుంది.