క్రికెట్ చ‌రిత్ర‌లో కొన్నిసార్లు విచిత్ర‌కర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి ఆడియ‌న్స్ త‌మ ప‌నుల‌తో న‌వ్విస్తుంటే మ‌రోసారి అంపైర్స్ లేదంటే ఆట‌గాళ్లు వినోదం పంచుతుంటారు. తాజాగా ఓ లేడి అంపైర్ క్రికెట్ చరిత్ర‌లో ఎవ‌రు ఊహించ‌ని విధంగా అంపైరింగ్ చేసి అంద‌రిని న‌వ్వించ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రిని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురి చేసింది. ప్ర‌స్తుతం ఆ అంపైర్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇది చూసిన ప్ర‌తి ఒక్కరు కూడా న‌వ్వ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య జ‌రిగిన రెండో వ‌న్డే జ‌రిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 26వ ఓవ‌ర్‌లో అష్ల‌గార్డ్‌న‌ర్ వేసిన చివ‌రి బంతికి ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ సున్ లూస్ స్వీప్ షాట్ ఆడే ప్ర‌య‌త్నం చేసింది. అయితే బంతిని అంచ‌నా వేయ‌డంలో ఆమె విఫ‌లం కావ‌డంతో బౌల్ మిస్ అయి ఆమె ప్యాడ్స్‌ని తాకింది. ఇంకేముంది ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు అపీల్ చేయ‌గా ఫీల్డ్ అంపైర్ పోలోసాక్ నాటౌట్‌గా ప్ర‌క‌టించింది. దీంతో ఆసీస్ రివ్యూ తీసుకుంది. థర్డ్ అంపైర్ సూ రెడ్‌ఫర్న్ బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ ద్వారా బంతి వికెట్లను మిస్సవుతుందని గుర్తించి నాటౌట్‌గా ప్ర‌క‌టించారు.

అయితే ఫీల్డ్ అంపైర్ క్లైర్ పోలోసోక్ థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యానికి విరుద్ధంగా ఔట్ ప్ర‌క‌టించింది. అంత‌లోనే త‌న త‌ప్పు తెలుసుకొని నాటౌట్ ఇచ్చింది. అయితే అంపైర్ చేసిన ప‌నికి ఆసీస్ ఆటగాళ్లతో పాటు కామెంటేట‌ర్స్, ఆడియ‌న్స్, నెటిజ‌న్స్ తెగ న‌వ్వుకుంటున్నారు. అంపైర్ గారు వేరే లోకంలో ఉన్న‌ట్టున్నారు. అందుకే అలా చేశారంటూ కొంద‌రు ఆ వీడియోకి కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి లేడి అంపైర్ నిర్ణ‌యం మాత్రం ప్ర‌తి ఒక్క‌రిని షాక్‌కి గురి చేయ‌డంతో పాటు న‌వ్వు తెప్పించింది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే వ‌ర్షం వ‌ల‌న 45 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆట ఆడించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా మహిళల జట్టు ఆరు వికెట్ల న‌ష్టానికి 229 ప‌రుగులు చేయ‌గా, ఆసీస్ జ‌ట్టు కేవ‌లం 29.3 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడి 149 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ఖాతాలో విజ‌యం వ‌చ్చి చేరింది.sn

sn

Next Story