Virat Kohli| కోహ్లీ బుల్లెట్ త్రోకి కంగుతిన్న గుజ‌రాత్ బ్యాట్స్‌మెన్‌.. ఈ వ‌య‌స్సులోను అలా ఎలా?

Virat Kohli| ఐపీఎల్ 2024లో భాగంగా గ‌త కొన్నాళ్లుగా ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు సాగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేశాయి. ఆర్ఆర్, కేకేఆర్

  • By: sn    sports    May 05, 2024 6:18 AM IST
Virat Kohli| కోహ్లీ బుల్లెట్ త్రోకి కంగుతిన్న గుజ‌రాత్ బ్యాట్స్‌మెన్‌.. ఈ వ‌య‌స్సులోను అలా ఎలా?

Virat Kohli| ఐపీఎల్ 2024లో భాగంగా గ‌త కొన్నాళ్లుగా ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు సాగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేశాయి. ఆర్ఆర్, కేకేఆర్ ప్లేఆఫ్స్‌కి దాదాపు వెళ్లిన‌ట్టే అని అర్ధ‌మ‌వుతుంది. మిగ‌తా రెండు స్థానాల‌కి వేరే జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. అయితే ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ప్ర‌స్తుతానికి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల ప‌ట్టిక‌లోను చివ‌రి స్థానం నుండి ఏడో స్థానానికి వ‌చ్చేసింది. ర‌న్ రేటు కూడా మెరుగు ప‌డింది.

మొద‌ట గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేయ‌గా, వారు కేవలం 19.3 ఓవర్లు మాత్ర‌మే ఆడి 147 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఈ టీంలో షారుక్ ఖాన్ (37; 24 బంతుల్లో, 5×4, 1×6) ఒక్క‌డే చెప్పుకోద‌గ్గ స్కోరు చేశాడు. ఆర్సీబీ బౌల‌ర్స్ యశ్ దయాల్ (2/21), విజయ్ కుమార్ వైశాక్ (2/23), మహ్మద్ సిరాజ్ (2/29) అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో ఎక్క‌డ కూడా కోలుకోలేక‌పోయింది గుజరాత్ జ‌ట్టు. అయితే 148 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ జ‌ట్టు టార్గెట్‌ని సునాయాసంగా ఊదేసింది.కేవ‌లం 13.4 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడి ఆరు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని సాధించింది కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో, 10×4, 3×6) , విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో, 2×4, 4×6) అద్భుతమైన ఆరంభం అందించ‌డంతో ఆర్సీబీ సునాయాసంగా గెలిచింది. ఇక గుజరాత్ బౌలర్లలో లిటిల్ (4/45) నాలుగు వికెట్లు తీశాడు.

అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వేసిన త్రో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆర్సీబీకి ప్ర‌మాద‌ర‌కంగా మారుతున్న భారీ హిట్టర్ షారుక్ ఖాన్ ని కోహ్లి స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. విజయ్ కుమార్ వైశాక్ వేసిన బంతిని తెవాతియా ఆఫ్‌సైడ్‌కు ఆడ‌గా, మ‌రో ఎండ్‌లో ఉన్న షారూఖ్ సింగిల్ కోసం కొంచెం ముందుకు వ‌చ్చాడు. అయితే తెవాటియా నో చెప్ప‌డంతో షారూఖ్ వెన‌క్కి వెళ్లాడు. కాని కోహ్లీ అప్ప‌టికే బాల్ అందుకొని మెరుపు వేగంతో విసిరాడు . బాల్ డైరెక్ట్‌గా వికెట్స్‌ని తాక‌డంతో షారూఖ్ ఖాన్ పెవీలియ‌న్ బాట ప‌ట్టాల్సి వ‌చ్చింది. ఈ వ‌య‌స్సులో కూడా అలాంటి ఫీల్డింగ్ చేయ‌డంపై అంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు