Viral Video | పార్క్‌ చేసిన కారులో వింత శబ్ధాలు.. దగ్గరికెళ్లిన చూసిన యువతి షాక్..!

Viral Video | కొన్నికొన్ని సార్లు మనకు జీవితంలో వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఊహించని అ పరిణామాలకు మనం షాకవుతుంటాం. అలాంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినా, వేరెవరైనా తమ మొబైల్‌లో రికార్డు చేసినా.. సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పార్క్ చేసిన కారులోంచి వింత శబ్ధాలు రావడం విని, దగ్గరకు వెళ్లి చూసిన యువతి ఒక్కసారిగా షాక్‌ అయ్యింది. ఆ హఠాత్పరిణామానికి ప్రాణభయంతో కీకలు పెడుతూ ఇంట్లోకి పరుగులు తీసింది.

Viral Video | పార్క్‌ చేసిన కారులో వింత శబ్ధాలు.. దగ్గరికెళ్లిన చూసిన యువతి షాక్..!

Viral Video : కొన్నికొన్ని సార్లు మనకు జీవితంలో వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఊహించని అ పరిణామాలకు మనం షాకవుతుంటాం. అలాంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినా, వేరెవరైనా తమ మొబైల్‌లో రికార్డు చేసినా.. సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పార్క్ చేసిన కారులోంచి వింత శబ్ధాలు రావడం విని, దగ్గరకు వెళ్లి చూసిన యువతి ఒక్కసారిగా షాక్‌ అయ్యింది. ఆ హఠాత్పరిణామానికి ప్రాణభయంతో కీకలు పెడుతూ ఇంట్లోకి పరుగులు తీసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి తన ఇంటి ముందు కారును పార్క్‌ చేసింది. అయితే ఆ కారులోంచి ఆమెకు వింత శబ్ధాలు వినిపించాయి. ఏందా అని ఇంట్లోంచే చూడగా కారు ముందు డోరు సగం తెరచి ఉంది. కారులోకి కోతినో, కుక్కనో దూరి ఉంటుందని భావించి కారు దగ్గరికి వెళ్లింది. పనిలోపనిగా కారులో కొన్ని పండ్లు పెట్టుకుని వద్దామని తీసుకెళ్లింది. కారు దగ్గరికి వెళ్లి ముందుగా సగం తెరిచి ఉన్న డోర్‌లోంచి లోపలికి తొంగిచూసింది. అంతే లోపల ఉన్న దృశ్యం చూసి ఆమెకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి.

ఎందుకంటే లోపల ఓ ఎలుగుబంటి ఉన్నది. ప్రాణభయంతో అరుస్తూనే లోపల ఉన్న ఎలుగు బయటకు రాకుండా ఆ యువతి కారు డోర్‌ను మూసివేసే ప్రయత్నం చేసింది. కానీ ఎలుగు బలం ముందు ఆమె బలం చాలక డోర్‌ను వదిలేసి, చేతిలోని పండ్లు కిందపడేసి, గావు కేకలు పెడుతూ ఇంట్లోకి పరుగందుకుంది. ఆమె అరుపుల శబ్ధానికి ఎలుగుబంటి కూడా భయంతో బయటికి దూకి పరుగందుకుంది. వెంటనే యువతే భయంతో పారిపోయిందని గ్రహించి వెనక్కి పండ్లను ఆరగించింది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆ యువతి ఇంటిముందున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎలుగుబంటికి కారంటే బాగా ఇష్టమున్నట్లుంది’ అని కొందరు, ‘యువతి పరుగు ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును బద్దలు కొట్టేలా ఉంది’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే 29 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..