Fakir Fraud| దేవుడినంటూ..చావ బాదాడు..!

Fakir Fraud| దేవుడినంటూ..చావ బాదాడు..!

విధాత : ఆధునిక సమాజంలోనూ మనిషి మూఢనమ్మకాల ప్రభావానికి లోనవుతున్న ఘటనలు తరుచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా నేనే దేవుడినంటూ ఓ ఫకీర్..దెయ్యం వదిలిస్తానని ఓ మహిళను కొరడాతో చావబాదిన ఘటన వీడియో వైరల్ గా మారింది. నారాయణపేట జిల్లా, మద్దూర్ మున్సిపాలిటీలో ఓ మసీదు వద్ద ఫకీర్ ఓ మహిళను దేవుడి పేరిట హింసించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. నేనే దేవుడినంటూ అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఆ ఫకీర్ తాజాగా ఓ మహిళకు దెయ్యం వదిలిస్తానని..మానసిక జబ్బును నయం చేస్తానంటూ ఊగిపోతూ కొరడాతో విచక్షణారహితంగా కొట్టాడు.

కొరడా దెబ్బలకు తాళలేక ఆ మహిళ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఫకీర్ మనుషులు మహిళను అడ్డుకుని మళ్లి కొరడా దెబ్బలు తినేలా చూశారు. దీంతో ఆ దెబ్బల్ని భరించలేక బాధిత మహిళ సొమ్మసిల్లి కిందపడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దెయ్యం వదలడం..మానసిక జబ్బు నయం కావడం ఏమోగాకి కొరడా దెబ్బలతో మరింత అనారోగ్యం పాలై చచ్చే పరిస్థితి ఏర్పడిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.