Human finger | కోన్‌ ఐస్‌క్రీమ్‌లో తెగిపోయిన మనిషి వేలు.. ఆ వేలు నోట్లోకి రావడంతో షాకైన డాక్టర్‌..!

Human finger | ఐస్‌క్రీమ్‌లు అంటే ఇష్టపడని వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది ఐస్‌క్రీమ్‌ను ఇష్టంగా ఆరగిస్తారు. కానీ ఐస్‌క్రీమ్‌పై ఇష్టమే ఓ వైద్యుడిని షాక్‌కు గురిచేసింది. ముంబైకి చెందిన ఓ వైద్యుడు ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ చేసుకుని తింటుండగా నోట్లోకి మనిషి వేలు వచ్చింది. దాంతో అతను భయంకరమైన షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Human finger | కోన్‌ ఐస్‌క్రీమ్‌లో తెగిపోయిన మనిషి వేలు.. ఆ వేలు నోట్లోకి రావడంతో షాకైన డాక్టర్‌..!

Human finger : ఐస్‌క్రీమ్‌లు అంటే ఇష్టపడని వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది ఐస్‌క్రీమ్‌ను ఇష్టంగా ఆరగిస్తారు. కానీ ఐస్‌క్రీమ్‌పై ఇష్టమే ఓ వైద్యుడిని షాక్‌కు గురిచేసింది. ముంబైకి చెందిన ఓ వైద్యుడు ఐస్‌క్రీమ్‌ ఆర్డర్‌ చేసుకుని తింటుండగా నోట్లోకి మనిషి వేలు వచ్చింది. దాంతో అతను భయంకరమైన షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన చెందిన యువ డాక్టర్‌ ఓర్లెమ్‌ బ్రెండన్‌ సెర్రావో తన సోదరితో కలిసి బుధవారం ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లు ఆర్డర్‌ పెట్టాడు. వారి ఆర్డర్ మేరకు ‘ది యుమ్మో బటర్‌స్కాచ్‌’ ఫ్లేవర్‌ కోన్‌ ఐస్‌క్రీమ్‌లను ఆ సంస్థ డెలివరీ చేసింది. ఇంకేముంది సీల్‌ ఓపెన్‌చేసి వైద్యుడు ఆ ఐస్‌క్రీమ్‌ను తినడం మొదలుపెట్టాడు. కాసేపటికి మెత్తగా ఉండే ఐస్‌క్రీమ్‌కు బదులుగా నోట్లో ఏదో గట్టిగా తగిలింది. ఏందా.. అని బయటికి తీసి చూడగా అది మనిషి తెగిపోయిన వేలు. అంతే ఆ వైద్యుడు ఒక్కసారిగా షాకయ్యాడు.

ఆ తర్వాత తేరుకుని రెండు అంగుళాల పొడవున్న వేలు ముక్కను తీసుకెళ్లి మలాడ్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ వేలును ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు.ఆ ఐస్‌క్రీమ్‌ తయారు చేసిన కంపెనీ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. కాగా ఐస్‌క్రీమ్‌ తయారీ సంస్థ ఈ ఘటనపై ఇప్పటివరకు స్పందించలేదు.