Stag Beetle | ఈ పురుగు చాలా కాస్ట్లీ గురూ.. దీని విలువ ఏకంగా రూ.75 లక్షలు..?

Stag Beetle ‌: పురుగంటే సాధారణంగా అందిరికీ చిన్నచూపే ఉంటుంది. ఎందుకంటే అవి బయట వ్యర్థాలపైన, మురుగుపైన, విసర్జితాలపైన వాలుతాయి. అవే పురుగులు లైట్ల వెలుతురుకు ఇండ్లలోకి వస్తాయి. కొన్ని పురుగుల నుంచి ఒక రకమైన దుర్వాసన వస్తుంది. ఈ పురుగులు ఆహార పదార్థాల్లో ఎక్కడ పడుతాయోననే భయంతో చాలామంది వాటిని అసహ్యించుకుంటారు. ప్రతి వ్యక్తి పురుగును హీనంగా చూస్తారు. అందుకే ఎవరినైనా చిన్నచూపు చూస్తే తమను పురుగు కంటే హీనంగా చూశారని బాధపడుతుంటారు.

Stag Beetle | ఈ పురుగు చాలా కాస్ట్లీ గురూ.. దీని విలువ ఏకంగా రూ.75 లక్షలు..?

Costly insect ‌: పురుగంటే సాధారణంగా అందిరికీ చిన్నచూపే ఉంటుంది. ఎందుకంటే అవి బయట వ్యర్థాలపైన, మురుగుపైన, విసర్జితాలపైన వాలుతాయి. అవే పురుగులు లైట్ల వెలుతురుకు ఇండ్లలోకి వస్తాయి. కొన్ని పురుగుల నుంచి ఒక రకమైన దుర్వాసన వస్తుంది. ఈ పురుగులు ఆహార పదార్థాల్లో ఎక్కడ పడుతాయోననే భయంతో చాలామంది వాటిని అసహ్యించుకుంటారు. ప్రతి వ్యక్తి పురుగును హీనంగా చూస్తారు. అందుకే ఎవరినైనా చిన్నచూపు చూస్తే తమను పురుగు కంటే హీనంగా చూశారని బాధపడుతుంటారు.

కానీ ఇప్పుడు ఒక పురుగు గురించి తెలుసుకుంటే మాత్రం పురుగులు హీనమనే మన అభిప్రాయం మారిపోతుంది. ఎందుకంటే అది చాలా కాస్ట్లీ పురుగు. దాని విలువ దాదాపు ఓ లగ్జరీ కారు ధరకు సమానం. అవును ఇది నిజమే. ఆ పురుగు విలువ ఏకంగా రూ.75 లక్షలు ఉంటుందట. దాని పేరు ‘స్టాగ్‌ బీటిల్‌’. ఈ పురుగు ఒక్క రోజులో మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది. ఎందుకంటే ఆ పురుగు అత్యంత అరుదైనది. దీన్ని అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు.

ఈ పరుగు చెక్కలపై ఆధారపడి జీవించే కీటక జాతికి చెందినది. అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. లండన్‌కు చెందిన ‘నేచురల్‌ హిస్టరీ మ్యూజియం’ ప్రకారం.. ఈ పురుగు బరువు 2 నుంచి 6 గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది దాదాపు 3 నుంచి 7 సంవత్సరాలు జీవిస్తుంది. మగ పురుగులు 35 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు, ఆడ పురుగులు 30 నుంచి 50 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ కీటకాలను చికిత్సల్లోనూ వాడతారు.

ఈ పురుగుల కొండీలు దుప్పిల కొమ్ములను పోలి ఉండటంతో వీటికి ‘స్టాగ్‌ బీటిల్స్‌’ అనే పేరు వచ్చింది. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడ పురుగులతో జత కట్టేందుకు ఈ కొండీలను ఒకదానికొకటి కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి. స్టాగ్‌ బీటిల్స్‌ ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తాయి. వీటికి చలి పడదు. ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తోటలు, పార్కులు వంటి నగర నాగరిక పరిసరాల్లోనూ జీవిస్తాయి.

ఈ స్టాగ్‌ బీటిల్స్‌ ముఖ్యంగా చనిపోయిన వృక్షాల కలపను నివాసంగా చేసుకొంటాయి. పెద్ద స్టాగ్‌ బీటిల్స్‌ చెట్ల నుంచి ‘సాప్‌’ అనే ద్రవాన్ని, కుళ్లిన పండ్ల నుంచి కారే తీపి స్రావాలను తిని జీవిస్తాయి. లార్వా దశలో ఇవి తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే అధికంగా ఆధారపడతాయి. తొలిదశలో ఇవి కలపను తమ పదునైన దవడలతో చీల్చి తింటాయి. ఇవి పచ్చటి మొక్కలకు హాని చేయవు. కేవలం మృత వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి.