Ruby glow Pine apple | సాదారణంగా ఒక ఫైనాఫిల్ రేటు రూ.50 ఉంటుంది. మహా అయితే రూ.100 ఉండొచ్చు. ఇంకా ఎక్కువ అనుకుంటే ఆఖరికి రూ.200 ధర పలుకొచ్చు. కానీ ఒక పైనాపిల్ వేల ధర పలుకడం గురించి ఎప్పుడైనా విన్నారా..? కానీ పైన తొక్క కొద్దిగా ఎరుపు వర్ణంలో కనిపించే ఈ పైనాపిల్ ఏకంగా వేల ధర పలుకుతోందట. అంత ఖరీదైన ఆ పైనాపిల్ ప్రత్యేకతలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం..
Ruby glow Pine apple : సాదారణంగా ఒక ఫైనాఫిల్ రేటు రూ.50 ఉంటుంది. మహా అయితే రూ.100 ఉండొచ్చు. ఇంకా ఎక్కువ అనుకుంటే ఆఖరికి రూ.200 ధర పలుకొచ్చు. కానీ ఒక పైనాపిల్ వేల ధర పలుకడం గురించి ఎప్పుడైనా విన్నారా..? కానీ పైన తొక్క కొద్దిగా ఎరుపు వర్ణంలో కనిపించే ఈ పైనాపిల్ ఏకంగా వేల ధర పలుకుతోందట. అంత ఖరీదైన ఆ పైనాపిల్ ప్రత్యేకతలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాలోని ఒక ప్రత్యేక ఉత్పత్తుల దుకాణం ఈ ఫైనాపిల్‌ను అమ్ముతుంది. పైన తొక్క ఎరుపు రంగులో ఉండటం కారణంగా దీనికి రూబిగ్లో అనే పేరు వచ్చింది. ఈ పైనాపిల్ పండు ధర ఏకంగా 395.99 డాలర్లు ఉంటుందట. మన కరెన్సీలో అయితే రూ.33,073 అన్నమాట. ఈ పైనాపిల్‌ను సామాన్యులు కొనలేరు. కానీ సంపన్నుల నుంచి ఈ పండ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుందట. ఇంతకూ ఈ పండులో ఏముందో చూద్దామా..?
ఈ పైనాపిల్ పండు చూడటానికి ఎరుపు రంగులో ఉంటుంది. ఇది ఎర్రటి తొక్క కలిగి ఉంటుంది. లోపల పసుపు రంగులో గుజ్జు మామిడికాయలా కనిపిస్తుంది. అమెరికాలోని ప్రముఖ ఆహార నిపుణుడు డెల్ మోంటే.. ఈ పండును అభివృద్ధి చేయడానికి దాదాపు 15 పరిశోధనలు జరిపాడు. ఈ పండు చాలా ఖరీదైనది కావడంతో ధనవంతులు మాత్రమే దీన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఈ పండులో మనకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయట. అంతేగాక దీని రుచి కూడా అమోఘంగా ఉంటుందట. అందుకే సంపన్నులు దీని కోసం ఎన్ని డబ్బులైనా వెచ్చిస్తున్నారు. ఈ పైనాపిల్ పండ్లు ఏడాదికి మూడు వేల నుంచి ఐదు వేల వరకు అమ్ముడుపోతున్నాయని అమెరికా దుకాణదారు చెబుతున్నారు.