Shubhanshu Shukla | క్షేమంగా భూమికి చేరిన శుభాంశు శుక్లా

Shubhanshu Shukla | విధాత: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం మంగళవారం మద్యాహ్నం క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక యాక్సియం-4 వ్యోమగామిల బృందం ఇరవై రెండున్నర గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాతా భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు.. కాలిఫోర్నియా తీరానికి సమీపంలో పషిఫిక్ మహా సముద్ర జలాల్లో దిగింది. ఆ వెంటనే క్యాప్సుల్స్ లో ఉన్న వ్యోమగాములను యూఎస్ నేవీ నాసా కేంద్రానికి తరలించింది. అక్కడ ఏడు రోజుల క్వారంటైన తర్వాత శుభాంశుశుక్లా భారత్ కు చేరుకుంటారు. శుభాంశు బృందం భూమిపైకి సురక్షితంగా ల్యాండ్ కాగానే శుక్లా తల్లిదండ్రుల భావోద్వేగానికి గురయ్యారు. కేట్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాక్సియం–4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు పెగ్గీ వాట్సన్ (అమెరికా), స్లావోజ్ ఉజ్నాన్‌స్కీ విస్నియెవ్‌స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) జూన్ 25న ఐఎస్‌ఎస్‌కు బయల్దేరడం తెలిసిందే. 28 గంటల ప్రయాణం అనంతరం వారు 26న విజయవంతంగా ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. శుభాంశు టీం దాదాపు 18 రోజులపాటు ఐఏఎస్ఎస్ లో గడిపింది. మొత్తం 60 రకాల ప్రయోగాలు చేసింది. 18 రోజుల్లో 96.5 లక్షల కిలోమీటర్లు వారు అంతరిక్షంలో ప్రయాణించారు. 230సూర్యోదయాలను శుక్లా టీమ్ వీక్షించింది. డయాబెటిక్ నియంత్రణ, క్యాన్సర్ చికిత్సలు వంటి వాటిపై పై పరిశోధనలు చేశారు. అంతరిక్షంలో మానవ ఆరోగ్య నిర్వహణ వంటి అంశాలపై కీలక ప్రయోగాలు చేశారు. అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన రెండో భారత వ్యోమగామగా శుభాంశు శుక్లా నిలిచిపోయారు.