తెంగాణకు 118.75 టన్నుల ఆక్సిజన్ త్వరలో చేరుకోనున్న 2వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
రైల్వేల ద్వారా 20 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల్లోదేశవ్యాప్తంగా 1125 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరాతెంగాణకు 118.75 టన్నుల ఆక్సిజన్‌త్వరలో చేరుకోనున్న 2వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుత మహమ్మారితో ఏర్పడిన ఇబ్బందును అధిగమించడంలో తోడ్పడుతూ నూతన మార్గాను అన్వేషిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాకు నిరంతరం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్‌ఎమ్‌ఓ) చేరవేసి భారతీయ రైల్వే శాఖ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇప్పటివరకూ, భారతీయ రైల్వే దేశంలోని వివిధ రాష్ట్రాకు 76 ట్యాంకర్లలో 1125 మెట్రిక్ టన్ను (సుమారు) ఎల్‌ఎమ్‌ఓను సరఫరా చేసింది. […]

రైల్వేల ద్వారా 20 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల్లో
దేశవ్యాప్తంగా 1125 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరా
తెంగాణకు 118.75 టన్నుల ఆక్సిజన్
త్వరలో చేరుకోనున్న 2వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
ప్రస్తుత మహమ్మారితో ఏర్పడిన ఇబ్బందును అధిగమించడంలో తోడ్పడుతూ నూతన మార్గాను అన్వేషిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాకు నిరంతరం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్‌ఎమ్‌ఓ) చేరవేసి భారతీయ రైల్వే శాఖ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇప్పటివరకూ, భారతీయ రైల్వే దేశంలోని వివిధ రాష్ట్రాకు 76 ట్యాంకర్లలో 1125 మెట్రిక్ టన్ను (సుమారు) ఎల్‌ఎమ్‌ఓను సరఫరా చేసింది. 20 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటికే తమ గమ్యస్థానాలకు చేరుకోగా, 422 మెట్రిక్ టన్నుల (సుమారు) ఆక్సిజన్‌తో లోడయిన 27 ట్యాంకర్లు మరో 7 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు త్వరలో గమ్యాన్ని చేరనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
కోరిన రాష్ట్రాకు వీలైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎల్‌ఎమ్‌ఓను అందించడానికి భారతీయ రైల్వే శాఖ తీవ్రంగా కృషి చేస్తుంది.తెలంగాణకు ఒడిస్సాలోని అంగూల్ నుండి 118.75 టన్నుల ఎల్‌ఎమ్‌ఓతో లోడయిన రెండవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం చేరుకోనుంది.
ఢిల్లీకి 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో కూడిన మూడవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ దుర్గాపూర్ నుండి బయలుదేరింది. ఇది ఢిల్లీకి 4 మే 2021 తేదీన చేరుకునే అవకాశాలున్నాయి.
హర్యానాకు అంగూల్ (ఒడిస్సా) మరియు రూర్కేలా (ఒడిస్సా) నుండి సుమారుగా 72 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపుకున్న 4వ, 5వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు త్వరలో చేరుకోనున్నాయి.
హాపా (గుజరాత్) నుండి 85 టన్నులతో మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బయుదేరి మార్గమధ్యలో ఉంది. ఇది త్వరలో ఎన్‌సీఆర్ ప్రాంతంలోని గుర్గావ్‌కు చేరుకోనుంది.422.08 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓతో కూడిన 7 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్ (4 వది), ఉత్తర ప్రదేశ్(10 వది), తెలంగాణ, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకు చేరుకోవడానికి మార్గమధ్యలో ఉన్నాయి.
ఇప్పటివరకూ భారతీయ రైల్వే మహారాష్ట్ర (174 మెట్రిక్ టన్నులు), ఉత్తర ప్రదేశ్ (430.51 మెట్రిక్ టన్నులు), మధ్య ప్రదేశ్ (156.96 మెట్రిక్ టన్నులు), ఢిల్లీ (190 మెట్రిక్ టన్నులు), హర్యానా (109.71 మెట్రిక్ టన్నులు) మరియు తెలంగాణ (63.6 మెట్రిక్ టన్నులు) రాష్ట్రాలకు మొత్తం 1125 మెట్రిక్ టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్‌ఎమ్‌ఓ) చేరవేసింది.