హైదరాబాద్ లో భారీగా బంగారం, నగదు సీజ్

హైదరాబాద్ లో భారీగా బంగారం, నగదు సీజ్

విధాత, హైద్రాబాద్‌ : హైదరాబాద్‌లో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, గాంధీ నగర్‌ పోలీసులు కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్‌ వద్ద చేపట్టిన తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.9కోట్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, కారు, బైక్‌ను సీజ్‌ చేశారు.


అలాగే మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎక్స్‌రోడ్‌ వద్ద పోలీసులు తనిఖీల్లో కారులో తరలిస్తున్న 17 కిలోల బంగారం, 17 కిలోల వెండి పట్టుబడింది. ఎన్నికల నిబంధనల మేరకు బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించిన బిల్లులు చూపకపోవడంతో పోలీసులు సీజ్‌ చేశారు. అలాగే వనస్థలిపురంలో పోలీసుల తనిఖీల్లో రూ.29.40లక్షలను స్వాధీనం చేసుకున్నారు.