45మందితో కాంగ్రెస్ రెండో జాబితా..లెఫ్ట్‌కు చెరో రెండు సీట్లు:మురళీధరన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను శుక్రవారం సాయంత్రం కల్లా విడుదల చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ వెల్లడించారు. రెండో జాబితాలో ఇప్పటకే ఏకాభిప్రాయం సాధించిన 45 స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు స్థానాలను ఇవ్వాలని అంగీకారం కుదిరిందన్నారు. ఆ స్థానాలను వదిలేసి కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటిస్తామన్నారు.

45మందితో కాంగ్రెస్ రెండో జాబితా..లెఫ్ట్‌కు చెరో రెండు సీట్లు:మురళీధరన్

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను శుక్రవారం సాయంత్రం కల్లా విడుదల చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ వెల్లడించారు. రెండో జాబితాలో ఇప్పటకే ఏకాభిప్రాయం సాధించిన 45 స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు స్థానాలను ఇవ్వాలని అంగీకారం కుదిరిందన్నారు. ఆ స్థానాలను వదిలేసి కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటిస్తామన్నారు. మిగిలిన స్థానాల అభ్యర్థుల ఖరారు నిర్ణయాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులకు వదిలేసామన్నారు.


కమ్యూనిస్టు పార్టీలకు కేటాయించాల్సిన స్థానాలు ఏమిటన్నదానిపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. ఆ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో లెఫ్ట్‌తో సీట్ల సర్ధుబాటు కొలిక్కి వస్తుందన్నారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట మిత్రపక్షలకు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా నల్లగొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ టికెట్‌ను బాలునాయక్‌కు, భువనగిరి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి, మునుగోడు రాజగోపాల్‌రెడ్డికి కేటాయించినట్లుగా తెలుస్తుంది.


సూర్యాపేట టికెట్ రేసులో పటేల్ రమేశ్‌రెడ్డి, ఆర్‌. దామోదర్ రెడ్డిల మధ్య, తుంగతుర్తి టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు, అద్దంకి దయాకర్‌ల మధ్య పోటీ నెలకొనడంతో వాటిపై ఏకాభిప్రాయం పిదప అభ్యర్థులను ప్రకటించే అవకాశమముంది