‘ప్రీతి’ ‘నిందితులపై చర్యలు తీసుకోవాల‌ని ABVP డిమాండ్.. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహ‌నం

విధాత: కాకతీయ మెడికల్ పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్య ఘటనకు బాధ్యులైన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, నల్గొండ పట్టణంలో వేర్వేరుగా ప్రభుత్వ, నిందితుడి దిష్టిబొమ్మలను దహ‌నం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కన్వీనర్ చత్రపతి చౌహన్, నల్గొండ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ కాకతీయ మెడికల్ కళాశాలల్లో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ప్రయత్నానికి […]

‘ప్రీతి’ ‘నిందితులపై చర్యలు తీసుకోవాల‌ని ABVP డిమాండ్.. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహ‌నం

విధాత: కాకతీయ మెడికల్ పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్య ఘటనకు బాధ్యులైన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, నల్గొండ పట్టణంలో వేర్వేరుగా ప్రభుత్వ, నిందితుడి దిష్టిబొమ్మలను దహ‌నం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కన్వీనర్ చత్రపతి చౌహన్, నల్గొండ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ కాకతీయ మెడికల్ కళాశాలల్లో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. కేఎంసీలో విధుల్లో ఉన్న డాక్టర్ ప్రీతి, సీనియర్ పీజీ వైద్యునిచే చాలా రోజుల నుంచి వేధింపులు తాళలేక మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడి చావుబతుకుల మధ్య పోరాడుతున్న తీరు అక్కడి ర్యాగింగ్ పరిస్థితులను చాటుతున్నాయన్నన్నారు. ఆసిఫ్ సైఫ్ అనే సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థి వేధింపులే ఈ ఘటనకు కారణమైనట్టు తెలుస్తుందన్నారు.

గతంలోనూ ఇలాంటి వేధింపులకు గురిచేస్తుంటే కేఎంసి యజమాన్యం మాత్రం పట్టించుకోకుండా ఉండడంతోనే ప్రీతీపై అతని వేధింపులు కొనసాగాయన్నారు. ఘటనపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయని, పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిందితులు తమ దుశ్చర్యలు కొనసాగిస్తున్నారన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం వెనుక నిష్పాక్షిక విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై, ప్రిన్సిపాల్‌పై, నిందితుల పైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు.

కార్యక్రమంలో సాయికిరణ్ హరిబాబు, ఉదయ్, రవి, సహయం, జయంత్, అఖిల్, ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అభినవ్, యూనివర్సిటీ అధ్యక్షులు పరశురామ్, జిల్లా గర్ల్స్ ఇన్‌చార్జి రిషిక, దయ, శివ, నాగసాయి, అర్చన్, శ్రీజ, శ్రుతి, షణ్ముకి , మహేష్, మురళి కృష్ణ, అరవింద్, దేవేందర్, రవి, మహేష్, రమేష్, యశ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.