KTR । కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. ఏ1గా మాజీ మంత్రి
ఈ ఫార్ములా వన్ రేసింగ్ ఉదంతంలో మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు బుక్ చేశారు.

KTR । ఈ ఫార్ములా వన్ రేసింగ్ ఉదంతంలో మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు బుక్ చేశారు. కేటీఆర్‌ను ఏ గా పేర్కొన్నారు. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ గా చేర్చారు. ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో 55 కోట్ల లావాదేవీలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయంలో కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ 1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ2గా చేర్చుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.