సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఇంట్లో ఏసీబీ సోదాలు

ఇటీవల లంచం తీసుకుని సస్పెండ్ అయిన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఇంటిలో సోమవారం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నది

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఇంట్లో ఏసీబీ సోదాలు

నెల రోజుల తర్వాత తనిఖీలు

విధాత, వరంగల్ ప్రతినిధి: ఇటీవల లంచం తీసుకుని సస్పెండ్ అయిన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఇంటిలో సోమవారం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నది. గత నెల 22న మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తస్లీమా మహమ్మద్ కు చెందిన హనుమకొండ లోని ఇంటితో పాటు ఆమె భర్త నివాసం ఉంటున్న సూర్యాపేట లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 22 తేదీన ఏసీబీకి పట్టుబడుగా దాదాపు నెల రోజుల తర్వాత తనిఖీలు చేయడం చర్చనీ అంశంగా మారింది. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.