TELANGANA ASSEMBLY | ఎజెండా జాప్యంలో ప్రభుత్వంపై అక్బరుద్దిన్ గరం..గళం కలిపిన కేటీఆర్
శాసన సభ సమావేశాల నిర్వాహణకు సంబంధించి ఎజెండా ఖరారు కాపీని సభ్యులకు సకాలంలో అందించకపోవడంపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధిన్ ఒవైసీ ఫైర్ అయ్యారు.

విధాత, హైదరాబాద్ : శాసన సభ సమావేశాల నిర్వాహణకు సంబంధించి ఎజెండా ఖరారు కాపీని సభ్యులకు సకాలంలో అందించకపోవడంపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధిన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కోరికల మీద, ఇష్టం మీద అసెంబ్లీ నడవకూడదని, సభ్యులందరిని పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికారు. ప్రతి రోజు మాకు ఎజెండా 1:00 గంటకు వస్తుందని, మొన్న మాత్రం 1:40 గంటలకు వచ్చిందని, అప్పుడు వస్తే సబ్జెక్ట్ మీద మేము ప్రిపేర్ ఎప్పడు కావాలని ప్రశ్నించారు.
25 ఏండ్ల నా అనుభవంలో ఇలా సభ జరగడం నేను ఎప్పడు చూడలేదని అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. బీఆరెస్ సభ్యుడు కేటీఆర్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సమావేశాల ఎజెండా కాపీని ఆలస్యంగా పంపించడంపై ప్రభుత్వం ఉద్దేశమెంటో అర్ధం కావడం లేదని, ప్రతి రోజు ఎజెండా మారుతావుందని, సమావేశాల ఎజెండా కాపీని సకాలంలో సభ్యులకు అందించాలని, అప్పుడే సమగ్ర చర్చకు అవకాశముంటుందన్నారు.