బీఆర్ఎస్‌లోకి అలుగుబెల్లి?
మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఆపార్టీకి రాజీనామా సమర్పించారు.

- మిర్యాలగూడ కాంగ్రెస్‌కు బిగ్ షాక్
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ఆపార్టీకి రాజీనామా సమర్పించారు. మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆయన భంగపాటుకు గురయ్యారు.
దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సొంతగూడు బీఆరెస్ కు చేరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనతో పాటు అనుచర గణం కూడా చేరనున్నారు. అమరేందర్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ రానుందని, కేడర్ లో నూతనోత్సాహం నెలకుందని ఆపార్టీ నాయకులు తెలిపారు.