వరంగల్ మహానగర అభివృద్ధికి మరో పోరాటం.. హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏకం చేయాలి

పరిపాలన సౌలభ్యం పేరుతో గత బీఆరెస్ ప్రభుత్వం చారిత్రక వరంగల్ జిల్లాను ఇష్టా రాజ్యంగా ఆరు ముక్కలు చేసి ఆరు జిల్లాలను చేసి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసి అభివృద్ధిలో వెనుకబడేశారని వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రముఖులు విమర్శించారు

వరంగల్ మహానగర అభివృద్ధికి మరో పోరాటం.. హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏకం చేయాలి

విధాత, వరంగల్ ప్రతినిధి:పరిపాలన సౌలభ్యం పేరుతో గత బీఆరెస్ ప్రభుత్వం చారిత్రక వరంగల్ జిల్లాను ఇష్టా రాజ్యంగా ఆరు ముక్కలు చేసి ఆరు జిల్లాలను చేసి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసి అభివృద్ధిలో వెనుకబడేశారని వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రముఖులు విమర్శించారు. శనివారం ప్రెస్ క్లబ్ లో వరంగల్ మహానగర పునఃనిర్మాణం, పరిపాలన సౌలభ్యం – అభివృద్ధిపై ముప్పిడి సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా గోష్ఠిలో నగర ప్రముఖులు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, మాజీ మేయర్ టి రాజేశ్వర్ రావు, సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారులు ముద్ధసాని సహోదర రెడ్డి, గుడిమల్ల రవికుమార్, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షులు పుల్లూరు సుధాకర్, సోమ రామమూర్తి, సాయిని నరేందర్, చిల్ల రాజేంద్ర ప్రసాద్, కర్ర యాదవ రెడ్డి, కొండ్ర నర్సింగరావు లు పాల్గొని మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం పేరుతో కేసీఆర్ చారిత్రక నగరాన్ని ఆరు ముక్కలుగా విచ్ఛిన్నం చేసి అస్తవ్యస్తంగా జిల్లాలు ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని, రాజకీయ చైతన్యాన్ని దెబ్బదీశారని వారు అన్నారు. గత పాలకులు చేసిన ద్రోహాన్ని ప్రస్తుత పాలకులు సమీక్షించి వరంగల్ హన్మకొండ జిల్లాలను ఏకం చేసి అభివృద్ధి చేయాలని అన్నారు. త్రినగరమైన వరంగల్ మహా నగరాన్ని ఏకం చేయడం ద్వారానే అభివృద్ధి జరుగుతుందన్నారు. నగరమంటే పారిశ్రామిక ప్రాతినిద్యం కలిగి ఉండాలని, పాలనా సౌలభ్యం అంటే ప్రజలకు జీవన అవసరాలను మెరుగుపరచేదిగా ఉండాలని అందుకు భిన్నంగా రాజకీయ, వ్యాపార వర్గాల మేలు కోసం జిల్లాలను ఏర్పాటు చేసి మహా నగరాన్ని విభజించారని, దక్షిణ భారత దేశాన్ని ఏలిన వరంగల్ కేంద్రాన్ని చారిత్రిక ఆనవాళ్లు లేకుండా చేయడమే కాకుండా అభివృద్ధిలో హన్మకొండ 30 స్థానంలో ఉందని, పాత జిల్లాల కేంద్రాలు అభివృద్ధి కేంద్రాలుగా ఉండేవని, కొత్త జిల్లాలతో ఆ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. మహా నగరాలకు రావల్సిన జాతీయ స్థాయి నిధులు, సంస్థలు రాకపోవడం వల్ల వరంగల్ మహానగర అభివృద్ధి వెనుకబడిపోతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్ మహా నగరానికే తరలిపోయి బతుకుతున్నారని, వరంగల్ మహా నగరాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రం లోని సగభాగం ప్రజలకు ఉపాధి కేంద్రంగా మారుతుందని అన్నారు. రెండు జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి వివరిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, డాక్టర్ అశోక్ రెడ్డి, న్యాయవాదులు చిల్ల రాజేంద్ర ప్రసాద్, కూనూరు రంజిత్ గౌడ్, రాచకొండ ప్రవీణ్ కుమార్, రాజ్ మహ్మద్, ఇతం నగేష్, నలిగింటి చంద్రమౌళి, ధారం జనార్ధన్, డాక్టర్ గిరిజరాణి, సింగారపు అరుణ, అడ్లూరి పద్మ, కొండ్ర నర్సింగరావు, పల్లపు సమ్మయ్య, మండల పరుషరాములు, మంద వీరాస్వామి, సంగాని మల్లేశ్వర్, సారంపెల్లి వాసుదేవ రెడ్డి, సోమిడి శ్రీనివాస్, బొట్ల చక్రపాణి, కొంగ వీరాస్వామి, నున్న అప్పారావు, బాబురావు, తాడిశెట్టి క్రాంతి కుమార్, కేడల ప్రసాద్, సూర్యనారాయణ, బుచ్చిరెడ్డి, ఓదెల రాజయ్య,