కేటీఆర్‌తో బిత్తిరి సత్తి భేటీ

కేటీఆర్‌తో బిత్తిరి సత్తి భేటీ

విధాత : బిత్తిరి సత్తి(చేవెళ్ల రవికుమార్ ముదిరాజ్‌) గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ముదిరాజ్ గర్జన సభలోబీఆరెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో పాటు ఆ పార్టీ ముదిరాజ్‌లకు ఒక్క సీటు కేటాయించకపోవడాన్ని బిత్తిరి సత్తి తప్పుబట్టారు.


కాగా.. ఇది జరిగిన కొన్ని రోజులకే బిత్తిరి సత్తిని ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న కేటీఆర్ ఆయనతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. బిత్తిరి సత్తి రాజకీయం ప్రవేశం చేస్తారా బీఆరెస్‌లో చేరుతారా లేక కళాకారుడిగా ఆయన సేవలను వినియోగించుకునేందుకు కేటీఆర్ ఆయనతో చర్చలు జరిపారా అన్న అంశాలపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి.