Tummala Nageswara Rao | కాంగ్రెస్ పై బీజేపీ ఆరోపణలు విడ్డూరం..వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రైతులకు రుణమాఫీ జరగలేదంటూ బీజేపీ నాయకులు కాంగ్రెప్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు వాగ్దానం ఏమైంది
బీజేపీ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే మీ దగ్గర సమాధానం ఉందా?
బీజేపీ నేతలను ప్రశ్నించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
విధాత: రైతులకు రుణమాఫీ జరగలేదంటూ బీజేపీ నాయకులు కాంగ్రెప్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. గత పది సంవత్సరాలలో పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే, పెరగని వాళ్ళందరినీ బిజెపి టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? అని అడిగారు. స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేసి, రైతులను ఆదుకోమని, రాజధాని వీధులకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న వారి విజ్ఙప్తులు ఎప్పుడన్న పట్టించుకొన్నారా? అని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేశారా అని అడిగారు. కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్తలనుండి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయగల నిబద్ధత మీకుందా? మంత్రి తుమ్మల బీజేపీ నేతలను ప్రశ్నించారు. గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం భారత రైతులకు కనీసం మద్ధతు ధర హామీ అమలు చేయక పోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతులే గత తొమ్మిదేళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారన్నారు. కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల గురించి మాట్లాడని వారు నేడు ఆర్థిక కష్టాలున్నప్పటికీ రుణమాఫీ అమలు చేస్తుంటే ఈ విధంగా మాట్లాడటం సరికాదని యావత్తు తెలంగాణ అభిప్రాయపడుతుందన్నారు.
రుణమాఫీ 2024 అమలుకు మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించిన తేదీ నుండి తీసుకొంటే రుణమాఫీ వర్తించే కుటుంబాలు తక్కువగా ఉండటం చేత, 12 డిసెంబర్2018 నుండి తీసుకొని, గత ప్రభుత్వము రుణమాఫీ చేయని కుటుంబాలకు కూడా వర్తింపచేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై గల ప్రేమను అర్ధం చేసుకోవచ్చని తెలిపారు.రుణమాఫీ 2024లో అక్కడక్కడా ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటు అర్హలైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకొంటున్నామన్నారు. దీనిపై ఏమైనా సందేహాలు బీజేపీ పెద్దలు స్వయంగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చని, రైతాంగాన్ని గందరగోళంలో నెట్టొద్దని మంత్రి తుమ్మల విజ్ఙప్తి చేశారు. తు