రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బోధన్‌ చైర్‌ పర్సన్‌

రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బోధన్‌ చైర్‌ పర్సన్‌
  • కొడంగల్‌ నుంచి పలువురి చేరికలు

విధాత, హైద్రాబాద్‌ : బోధన్‌ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను తట్టుకోలేక తాము బీఆరెస్‌కు రాజీనామా చేస్తున్నామని ప్రకటించిన బోధన్‌ మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి దంపతులు తమ మద్ధతుదారులత కలిసి కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.



తూముకుంట దంపతులతో పాటు కౌన్సిలర్లు శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, పిట్ల సత్యనారాయణ, మీరు నజీర్ అలీ, ఇమ్రాన్, జావీద్, అబ్దుల్లా, తాళ్ల లత, రవిచంద్ర సర్పంచులు అంజమ్మ, రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాల్ రాజు గౌడ్‌లు కాంగ్రెస్‌లో చేరారు. ఇదిలా ఉండగా వారంతా గాంధీభవన్‌కు ర్యాలీగా బోధన్ నుంచి బయలుదేరగా పోలీసులు ర్యాలీలో పాల్గొన్న వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. 



 అప్రమత్తమైన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా హైద్రాబాద్‌కు చేరుకుని కాంగ్రెస్‌లో చేరారు. అటు ఎమ్మెల్యే షకీల్ ను ఓడిస్తామని రంజాన్ పండగ రోజు ఎంఐఎం కార్పొరేటర్లు శపథం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రేవంత్‌ సమక్షంలో కొడంగల్‌ నియోజకవర్గంకు చెందిన బీఆరెస్‌ నేతలు పలువురు రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.