గులాబీ జెండా.. ప్రజలకు అండ : ఎమ్మెల్యే దివాకర్ రావు
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, గులాబీ జెండా పేదల

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, గులాబీ జెండా పేదలకు అండగా ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు.
మంచిర్యాల జిల్లాకేంద్రంలోని బైపాస్ రోడ్ రాళ్ల వాగుపై ఎత్తువంతెన నిర్మాణం కోసం రూ.12 కోట్ల నిధులను మంజూరు చేసిన సందర్భంగా వాగు వద్ద గురువారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టే ప్రజలకు మేలు జరుగుతున్నదని, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని, ప్రతిపక్ష నాయకుల మాయమాటలు నమ్మే పరిస్థితిలో లేరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.