రైతు సమస్యలపై సీఎస్‌కు బీఆరెస్ నాయకుల వినతి
సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి బీఆరెస్ ఎమ్మెల్యేలు, నాయకులు రైతు సమస్యలపై వినతిపత్రం అందించారు

విధాత : సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి బీఆరెస్ ఎమ్మెల్యేలు, నాయకులు రైతు సమస్యలపై వినతిపత్రం అందించారు. అన్ని పంటలను రూ. 500 బోనస్‌తో కొనుగోలు చేయాలని సీఎస్‌కు బీఆరెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు రూ.25 వేలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కలిసిన వారిలో మాజీ మంత్రులు జి. జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, వివేకానంద గౌడ్, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, భేతి సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.